MOVIE NEWSSpecial Bites

*ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ.. కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ డడ్లాని*

*Telugu Indian Idol 2 which is streaming on Aha is very popular. Bollywood music icons Himesh Reshammiya, Shreya Ghoshal, Vishal Dadlani are amazed by the talent of the contestants*

సంగీతానికి ఎల్లలు లేని ఒక ప్రపంచ స్థాయి భాష. అదే నేడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు  తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది. తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి  చేరుతోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. 

పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన  గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు.  సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ చిత్రంలో ఒరిజినల్ పాటను ఆమె శ్రేయానే ఆలపించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. ఈ షో ఇలాగే దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించి, కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.

షో గురించి ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు మాట్లాడుతూ ” తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ తమ గాత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందండం చాలా సంతోషంగా ఉంది. ఆహా ఓటీటీ ఈ షో ద్వారా ప్రతిభావంతులైన గాయకులను ప్రపంచానికి పరిచయం చేయడంలో విజయవంతమౌతుంది. రానున్న రోజుల్లో ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తెలుగు సంగీత ప్రపంచంలో తమ స్థానాన్ని సుస్ధిరపరుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని సగర్వంగా చెప్పుకొచ్చారు.

*తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.*

Tags

Related Articles

Back to top button
Close
Close