Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి , బివి నందిని రెడ్డి, స్వప్న సినిమాస్ ‘అన్నీ మంచి శకునములే’   సెకండ్ సింగిల్ ‘సీతా కళ్యాణం’ శ్రీరామ నవమి శుభ సందర్భంగా విడుదల

Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Gauthami, BV Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Second Single Sita Kalyanam Unveiled On Sri Rama Navami

Sita-Kalyanam

ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ప్రైమ్ ఛాయిస్. ఈ వేసవిలో, పూర్తి వినోదాన్ని అందించడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్  నటిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ థియేటర్ లోకి వస్తోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంది. టీజర్, టైటిల్ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ రెండవ సింగిల్ ‘సీతా కళ్యాణం’ పాటని విడుదల చేశారు.  

శ్రీరామ నవమి వేడుకకు తగిన పాట సీతా కళ్యాణ వైభోగమే. పాటంతా ఒక పండగలా వుంది. ఈ సీజన్‌లో పెళ్లి పాటగా అలరించబోతుంది.  విజువల్స్ వివాహ వేడుకలను అద్భుతంగా చూపించాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ ఆహ్లాదకరమైన పాటను చిత్రీకరించడంలో నందిని రెడ్డి మరోసారి తన మార్క్ చూపించారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, చైత్ర అంబడిపూడి , శ్రీకృష్ణ  ఎంతో మధురంగా ఆలపించారు. స్క్రీన్‌పై పూర్తి విజువల్స్‌తో పాట మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ  చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి ..పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు అందించారు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

సమ్మర్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటిగా మే 18న సినిమాను విడుదల చేస్తున్నారు.

తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: బివి నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close