MOVIE NEWSSpecial Bites

శ్రీ రామ నవమి వైభవాన్ని చాటి చెప్పేలా ఆదిపురుష్ కొత్త పోస్టర్

Adipurush's Ram Navami Special Poster is Here

Adipurush

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో రాఘవ్‌గా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, శేష్‌గా సన్నీ సింగ్‌, భజరంగ్‌గా దేవదత్తా నాగే వారికి వంగి వంగి వంగి నమస్కరిస్తున్నట్లు ఉంది. శ్రీ రామ ధర్మాన్ని మరోసారి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే శ్రీ రాముడి నైజాలైన ధర్మం, ధైర్యం, త్యాగం వంటి అంశాలు పోస్టర్ లో ప్రతిబింబించేలా రూపొందించారు.
శ్రీ రామనవమి అంటే శ్రీరాముని జన్మదిన, వివాహ మహోత్సవం. ఆయన మంచితనానికి ప్రారంభంగా ఈ రోజును నిర్వహించుకుంటారు. అందుకే అధర్మాన్ని ఓడించి, ధర్మ స్థాపన చేసిన రాముడుగా ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశారు. ఇక రీసెంట్ గానే వైష్ణోదేవి ఆలయంలో ఆశీస్సులు అందుకుని మూవీ ప్రమోషన్స్ ను ఈ శ్రీ రామనవమి నుంచి ప్రారంభిస్తాం అని చెప్పింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టుగానే ఈ పోస్టర్ తో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. త్వరలోనే మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి టి- సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ నిర్మించారు. అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఆదిపురుష్ 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags

Related Articles

Back to top button
Close
Close