EventEvents/PressmeetsMOVIE NEWSSpecial Bites

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల

Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao Releasing Worldwide Grandly On October 20th

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌ బస్టర్‌ లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ ను కేటాయించారు.

తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల అవుతుంది. దసరా నుంచి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వేట ప్రారంభమవుతుంది. దసరా బిగ్గెస్ట్ సీజన్ తో పాటు పర్వదినం. ఈ సినిమా లాంగ్ ఫెస్టివల్ హాలిడేస్ కలసిరానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావు గెటప్‌ లో పొగలు కక్కుతున్న రైలు పై నిలబడి కనిపించారు రవితేజ.

టైగర్ నాగేశ్వరరావు 1970 ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆర్ మదీ  ISC సినిమాటోగ్రాఫర్ కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

నటీనటులు: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు

రచయిత, దర్శకుడు: వంశీ

నిర్మాత: అభిషేక్ అగర్వాల్

బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్

సహ నిర్మాత: మయాంక్ సింఘానియా

డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: ఆర్ మదీ

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close