
ఏస్ డైరెక్టర్ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ కాంబోలో రూపొందుతోన్న విజువల్ వండర్ `పొన్నియిన్ సెల్వన్`.. మార్చి 29న ఘనంగా ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుక
Ace Director Mani Ratnam, Lyca Productions Magnum Opus "Ponniyin Selvan 2" Grand Audio and Trailer Launch event is on March 29th

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం ఆవిష్కరిస్తోన్న విజువల్ వండర్ `పొన్నియిన్ సెల్వన్ 2`. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. గత ఏడాది సెన్సేషనల్ హిట్ అయిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1కి కొనసాగింపుగా పొన్నియిన్ సెల్వన్ 2 తెరకెక్కుతోంది. రెండో భాగంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` విడుదలవుతుంది.
ప్రేమ, పగ, ప్రతీకారం, రాజకీయం, రాజ్యాధికారం, వీరత్వం..వంటి అంశాల చుట్టూ తిరిగే హిస్టారికల్ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బి.టి.ఎస్ వీడియో, ఆగనందే పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న ఘనంగా జరగనుంది. చిత్ర యూనిట్ సహా పలువురు స్టార్స్ ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు.
అత్యద్భుతమైన కోటలు, అంతకు మించిన కథ, కథనం, అందులో రాజతంత్రం, ఒకరికి ముగ్గురు హీరోలు, స్క్రీన్ నిండుగా హీరోయిన్లు అంటూ వేరే లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోంది పొన్నియిన్ సెల్వన్2. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ తమిళ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.