Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

రక్షిత్ అట్లూరి హీరో గా “పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ” చిత్రం ప్రారంభం !

Rakshit Atluri as the hero of the movie "Police Station Private Limited"!

“పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ “

మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరోరక్షిత్ అట్లూరి, గొల్ల పాటి నాగేశ్వరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ మరియు రాజరాయ్ లు నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి క్లాప్ కొట్టగా ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శకుడు గొల్ల పాటి నాగేశ్వరావు మాట్లాడుతూ…
ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా , పోలీస్ నేపథ్యం లో ఈ సినిమా ఉండబోతోంది. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
హీరోరక్షిత్ మాట్లాడుతూ…

హీరో రక్షిత్ మాట్లాడుతూ…
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. ఒక మంచి టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

ప్రొడ్యూసర్ మాట్లాడుతు విశ్వేశ్వర శర్మ శర్మ గారు మాట్లాడుతూ మా డైరెక్టర్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ తో సరి కొత్త కధాంశం తో చిత్రాన్ని నిర్మిస్తామని ఒక మంచి సినిమా స్టోరీ చాల బాగుంది. త్వరలో మిగతా నటీనటులు వివరాలు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియియజేస్తాను అని చెప్పారు . ఈ కార్యక్రమంలో యు అండ్ ఐ అధినేత పద్మనాభ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు .

నటీనటులు:

రక్షిత్ అట్లూరి ,

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మంత్ర ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ , రాజరాయ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం:
గొల్ల పాటి నాగేశ్వరావు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాలాజీ శ్రీను
పీఆర్ఒ: శ్రీపాల్ చొల్లేటి

Tags

Related Articles

Back to top button
Close
Close