ActressEvents/PressmeetsGALLARYMOVIE NEWSSpecial Bites

కనురెప్ప వెయ్యనివ్వని చిత్ర కథనం, చూపు మరల్చలేని కథా గమనం అదే ఐరావతం

Kanureppa Veyyanivvani Chitra Kathanam, Chupe Maralcaleni Katha Gamanam Ade Airavatam

ఉహించని విజయం. “ఐరావతం” ఒక వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేసిన మేజిక్ ఐరావతం ద్విముఖం (పార్ట్2) తీయడానికి నాంది పలికింది.

ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు లో ఇంకా ఆదరణలో ఉన్న చిత్రం “ఐరావతం”. ఇప్పటివరకు 200 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ దక్కించుకుని ప్రేక్షకుల ఆదరణ లోనే ఉంది.

ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది.

ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టిన “ఐరావతం” ఈ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్ గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియో లు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమికుడు వెళ్లిపోతుంది. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీ ని స్టోరీ మూడ్ ఫ్లో కి అనుగుణంగా చిత్రీకరించారు.

నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

న్యూ యేజ్ థ్రిల్లర్ “ఐరావతం” విశేష‌మైన ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఇప్పటికీ 200 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. దీనికి వ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో టీమ్ అంతా క‌ల‌సి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది.
ఫ్యామిలీతో క‌లిసి తెల్ల కెమెరా చేసిన మాయలు చూసి ఎంజాయ్ చేయాల‌నుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్ర‌సారమ‌వుతున్న “ఐరావతం” స్ట్రీమ్ చెయ్యాలి.

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
సమర్పణ: రేఖ పలగాని
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : సుహాస్ మీరా,
సినిమాటోగ్రాఫ‌ర్‌: ఆర్ కె వెల్లపు
సాంగ్స్ మ్యూజిక్: సత్య కశ్యపు,
రి రికార్డింగ్: కార్తిక్ కడగండ్ల,
లిరిక్స్‌: పూర్ణాచారి,
ఎడిటింగ్‌: సురేష్ దుర్గం,
పి ఆర్ ఓ : మధు

Tags

Related Articles

Back to top button
Close
Close