Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

మైత్రీ మూవీ మేకర్స్ ప్రజంట్స్, కిరణ్ అబ్బవరం, రమేష్ కడూరి, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మీటర్’ సెకండ్ సింగిల్  ‘ఓ బేబీ’ ని  లాంచ్ చేసిన బ్లాక్ బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి

Blockbuster Maker Anil Ravipudi Launched The 2nd Single Oh Baby From Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter

Oh-Baby

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘మీటర్’.  నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్ సపోర్ట్‌తో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మీటర్ టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్  అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ చమ్మక్ చమ్మక్ పోరి సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈరోజు,  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మీటర్ సెకండ్ సింగిల్ ఓ బేబీ లిరికల్ వీడియోను లాంచ్ చశారు. సాయి కార్తీక్  లైవ్లీ  బీట్‌లతో లవ్లీ నెంబర్ ని కంపోజ్ చేశారు. బాలాజీ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ధనుంజయ  తన వాయిస్ తో మస్మరైజ్ చేశారు.  

ఈ పాట కిరణ్ అబ్బవరం అతుల్య రవిపై ప్రేమను వర్ణిస్తుంది. అయితే ఆమెకు మొదట్లో అలాంటి ఫీలింగ్స్ లేవు. అతని ప్రయత్నాలు ప్రేమని అంగీకరించేలా చేస్తాయి. కిరణ్ అబ్బవరం పాటలో జాయ్ ఫుల్ గా కనిపించాడు. పాటలో కిరణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అతుల్య చాలా అందంగా కనిపించింది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రమేష్ కడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పకులు: నవీన్ యెరనేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సాయి కార్తీక్
డీవోపీ: వెంకట్ సి దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్: JV
డైలాగ్స్: రమేష్ కడూరి, సూర్య
లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబా సాయి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: మధు మాదురి, వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close