
Shakuntalam: శాకుంతలం పై మినీ రివ్యూ ఇచ్చిన సమంత
Shakuntalam: Samantha gave a mini review on Shakuntalam

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం‘శాకుంతలం’.కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది.
ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఇప్పటికే ట్రైలర్ విడుదలైయింది.
‘తాజాగా ఈ సినిమా సమంత చూశారు.అనంతరం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.’’ఫైనల్ గా సినిమా చూశాను. గుణశేఖర్ గారు ఓ అద్భుతమైన చిత్రాన్ని తీశారు. మన గొప్ప ఇతిహాసాలలో ఒకటి చాలా అందంగా జీవం పోసుకుంది. ప్రేక్షకులకు ఈ సినిమా చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పిల్లలందరూ మా అద్భుత ప్రపంచాన్ని ప్రేమించబోతున్నారు. దిల్ రాజు, నీలిమ ఈ అద్భుతమైన ప్రయాణానికి ధన్యవాదాలు. శాకుంతలం ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా వుండే చిత్రం’’ అని చెప్పుకొచ్చారు. త్వలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.