Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

సామజవరగమనా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సమ్మర్ లో విడుదల చేస్తున్నాం.‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీ విజువల్ గ్రాండియర్ గా వుంటుంది: నిర్మాత రాజేష్ దండా

Samajavaragamana is an out and out family entertainer. Releasing in summer. 'Uru Parama Bhairavakona' is a supernatural fantasy visual grander on a very large scale: Producer Rajesh Danda

సామజవరగమనా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ విష్ణు గారు ఇంతవరకూ చేయని జోనర్. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం లా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్. సామజవరగమనా సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. ఇందులో గ్రాండ్ విజువల్స్, మంచి ఫన్, పాటలతో పాటు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. ఊరు పేరు భైరవకోన’ జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజేష్ దండా.

సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో  రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమనా చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణ లో నిర్మిస్తున్నారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారాయన. 

నిర్మాతగా మీ ప్రయాణం గురించి?

స్వామిరారా చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా నా ప్రయాణం మొదలైయింది. దాదాపు 82 చిత్రాలు  డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. సందీప్ కిషన్ గారితో వున్న పరిచయం వలన కేరాఫ్ సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. తర్వాత ఒక్క క్షణం, నాంది సినిమాలకి  కో ప్రొడ్యూసర్ గా చేశాను.  నాంది విడుదల తర్వాత మనమే ఎందుకు నిర్మాతగా చేయకూడదని అనిపించింది. టైగర్ సినిమా నుంచి సందీప్ కిషన్, విఐ ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ మొదలుపెట్టండి నేను సినిమా చేస్తా’ అని సందీప్ కిషన్, డైరెక్టర్ గారు అన్నారు. అలా హాస్య మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. అనిల్ సుంకర గారితో నాకు మంచి అనుబంధం వుంది. ఆయన బ్యానర్ లో ఆరు సినిమాలకి  డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. ఆయన సపోర్ట్ తో మరో రెండు సినిమాలు స్టార్ట్ అయ్యాయి.

మొదట నిర్మించింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కదా ? దాని ఫలితం తృప్తిని ఇచ్చిందా ? 

మేము మొదట స్టార్ట్ చేసిన చిత్రం ఊరు పేరు భైరవకోన. కొన్ని కారణాల వలన అది ఆలస్యమైయింది. దీంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముందు విడుదలైయింది. కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే మంచి సినిమా తీశాననే పేరు తీసుకొచ్చింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఓటీటీలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. 

ఊరు పేరు భైరవకోన, సామజవరగమనా సినిమాల విడుదల ఎప్పుడు ?

సామజవరగమనా సమ్మర్ లో విడుదలౌతుంది. ఊరు పేరు భైరవకోన చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. చాలా సీజీ వర్క్ వుంటుంది. జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఊరు పేరు భైరవకోన లో గ్రాండ్ విజువల్స్, ఫన్, మంచి పాటలు వుంటాయి. మంచి కమర్షియల్ సినిమా ఇది.

డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే ఎక్కువ అనే భావన వుంది కదా ?

డిస్ట్రిబ్యూటర్ గా నాకు సక్సెస్ ఎక్కువ. ఏడాది లో పది సినిమాలు విడుదల చేస్తే ఎనిమిది హిట్లు. స్వామి రారా, కార్తికేయ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రారా కృష్ణయ్య, నిను వీడని, ఎన్టీఆర్ గారి టెంపర్, మహేష్ బాబు గారి సరిలేరు నీకెవ్వరు ఇలా సెలెక్టెడ్ గా వెళ్లాను. డిస్ట్రిబ్యూషన్ లో విజయవంతంగానే వచ్చా.

మీ ప్రతి సినిమాకి మంచి తెలుగు టైటిల్ పెడుతున్నారు ? పైగా పెద్ద పేర్లు ఉంటున్నాయి.

అన్నీ కథ ప్రకారం కుదురుతున్నాయి. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఆ ఊరి కథ. దీంతో అదే టైటిల్ యాప్ట్. సందీప్ కిషన్ గారి ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్ధమౌతుంది. దానికి మంచి లింక్ వుంటుంది. సామజవరగమనా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. విష్ణు గారు ఇంతవరకూ చేయని జోనర్. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం లా ఫుల్ కామెడీ అండ్ ఎంటర్ టైనర్. సామజవరగమనా క్యాచిగా వుంటుందని ఆ టైటిల్ పెట్టాం. ఉగాదికి ఒక పాటని లాంచ్ చేస్తున్నాం.

ఊరు పేరు భైరవకోన భారీ స్థాయిలో వుంటుంది అని సందీప్ కిషన్ గారు చెప్పారు ? బడ్జెట్ విషయంలో రిస్క్ అనిపించలేదా ? 

ఊరు పేరు భైరవకోన అద్భుతమైన కథ. సూపర్ నేచురల్ ఫాంటసీ ఫిల్మ్. ఖర్చు విషయంలో రిస్క్ అనుకోవడం లేదు. కథ అనుకున్నప్పుడే దిన్ని పెద్ద చేయాలని దిగాం. అప్పుడే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎంతకి ఇస్తారా అని అడుగుతున్నారు. టీజర్ పడే దాక దాని గురించి ఇప్పడే వద్దని చెప్పాం.

డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ లో  ఏది సులువు?  ఏది కష్టం ?

దేని కష్టం దానికి వుంది. అయితే నా వరకూ ప్రొడక్షన్ బావుందని భావిస్తున్నాను. మనకి నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది.  

నెక్స్ట్ ప్లాన్స్ ఏమిటి ?

ఆగస్ట్ లో నరేష్ గారితో సోలో గా ఒక సినిమా చేయబోతున్నా. సోలో బ్రతుకే సొ బెటరు ఫేం సుబ్బు గారు దీనికి దర్శకత్వం. అలాగే శ్రీవిష్ణు గారితో మరో సినిమా చర్చలో వుంది. సాయి ధరమ్ తేజ్ గారు నాకు ఇష్టమైన హీరో. ఆయనతో ఒక సినిమా చేయాలని వుంది. అలాగే నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచన వుంది. 

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close