GALLARYMOVIE NEWSSpecial Bites

“KCPD” (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్ ) చిత్రం నుండి యంగ్ & డైనమిక్ హీరో రామిడి శ్రీరామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Young & Dynamic Hero Ramidi Sreeram First Look Poster Release From "KCPD"(Konchem chusi preminchu Dude)

రామిడి శ్రీరామ్, తనీష్ అల్లాడి,ద్వారక విడియన్ (బంటి) ప్రియాంక నిర్వాణ,దివ్య డిచోల్కర్ నటీ నటులుగా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “KCPD” (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) శర వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. అయితే యంగ్ & డైనమిక్ హీరో రామిడి శ్రీరామ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర హీరో రొమాంటిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం హీరో రామిడి శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది .

ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..రామిడి శ్రీరామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మొదటి షెడ్యూల్ జరుపుకుంటున్న మా “KCPD” (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్ ) సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నటించిన నటీ నటులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లా కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మేము వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే మంచి కథతో వస్తున్న మా సినిమాకు మీ సపోర్ట్ మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close