Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

“విల్లా 369” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు తేజ..

Director Teja released the first look of "Villa 369".

విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లు గా సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్, నిర్మాతగా, డా.రాకేష్ సహ నిర్మాతగా కలసి చేస్తున్న సినిమా “విల్లా 369”. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు తేజ విడుదల చేశారు.

అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన “విల్లా 369” సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

చిత్ర నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి దర్శకుడు మంచి నటీ నటులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు డి. ఓ. పి ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు…

చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. నిర్మాతల విద్య గణేష్, సహ నిర్మాత డా.రాకేష్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు లు అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీ నటులు రవి వర్మ, జ్యోతి, చిత్రం శ్రీను, శివారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : విద్య గణేష్
దర్శకుడు : సురేష్ ప్రభు
సహ నిర్మాత : డా.రాకేష్
కెమెరా : ర్యాడీ రఫీ
సంగీతం : మహావీర్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు
పి. ఆర్ ఓ : మధు వి.ఆర్

Tags

Related Articles

Back to top button
Close
Close