Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్ష‌కులు, విమర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన అంథాల‌జీ డ్రామా ‘పంచతంత్రం’ … మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్

Critically-acclaimed anthology drama ‘Panchathantram’ up for a digital premiere

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో స‌మ‌ర్ప‌ణ‌లో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్‌పై హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, స్రుజ‌న్ ఎర‌బోలు ఈ అంథాల‌జీని నిర్మించారు.

గ‌త ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశారు. అందులో కాన్సెప్ట్స్‌, న‌టీన‌టుల ప్ర‌తిభ‌, టెక్నీషియ‌న్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. మ‌న శరీరంలోని పంచేద్రియాల‌ను జ్ఞాప‌కాల‌తో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాల‌నే పాయింట్‌తో ఈ అంథాల‌జీని చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని, అలాగే ఐదు క‌థ‌ల హృద‌య స్పంద‌న‌గా పంచ‌తంత్రంను రూపొందించార‌ని క్రిటిక్స్ త‌మ రివ్యూస్ ద్వారా అభినందించారు.

 ప్రేమ‌, భ‌యం, చావు, న‌మ్మ‌కం, ల‌క్ష్యాల‌ను సాధించ‌టం అనే అంశాలతో వేర్వేరు ఐదు క‌థ‌ల స‌మాహారంగా ఈ అంథాల‌జీని రూపొందించారు. ఈ అంథాల‌జీ మార్చి 22న ఈటీవీ డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

న‌టీనటులు:

బ్ర‌హ్మానందం, స‌ముద్ర ఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ విజ‌య్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య శ్రీపాద‌, శ్రీవిద్య‌, వికాస్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌:  అయేషా మ‌రియం
ఎడిట‌ర్ :  గ్యారీ బి.హెచ్‌
సినిమాటోగ్ర‌ఫీ :  రాజ్ కె.న‌ల్లి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సాయిబాబు వాసి రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సునీత పండోల్క‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  భువ‌న్ సాలూరు
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఉషా రెడ్డి వ‌వ్వేటి
డైలాగ్స్‌:  హ‌ర్ష పులిపాక‌
సాహిత్యం:  కిట్టు విస్సాప్ర‌గ‌డ‌
మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌:  ప్ర‌శాంత్ ఆర్‌.విహారి, శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
కో ప్రొడ్యూస‌ర్స్‌:  ర‌మేష్ వీర‌గంధ‌న్‌, రవ‌ళి క‌లంగిస‌
నిర్మాత‌లు:  అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, స్రుజ‌న్ ఎర‌బోలు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  హ‌ర్ష పులిపాక‌

———–> Panchathantram Trailer – https://youtu.be/IL2uYmreTxA <————–

Critically-acclaimed anthology drama ‘Panchathantram’ up for a digital premiere

Panchatantram_ETV_Win

The drama to be released on ETV Win on March 22

‘Panchathantram’, starring ‘Kathaa Brahma’ Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay, Divya Sripada, ‘Mathu Vadalara’ fame Naresh Agasthya and Srividya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. The Weekend Show is its presenter.

When the anthology film was released in theaters on December 9th of last year, it was met with instant applause from both critics and audiences. According to one film critic, the movie presents “the idea of viewing life as a collection of memories by connecting those memories to the five senses.”

“The film tells five different short stories about the pursuit of love, fear, death, and hope, all centered around the theme of the five senses,” stated another critic. “Panchatantram” is a genuine collection of five heartfelt stories where the writing, acting, and technical aspects come together to create a realistic drama,” as described in a review.

Cast:

Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, Rahul Vijay, Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Adarsh Balakrishna and others.

Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media)
Costume Designer: Ayesha Mariam
Editor: Garry BH
Cinematographer: Raj K Nalli
Production Controller: Sai Babu Vasireddy
Line Producer: Sunitha Padolkar
Executive Producer: Bhuvan Saluru
Creative Producer: Ushareddy Vavveti
Dialogues: Harsha Pulipaka
Lyrics: Kittu Vissapragada
Music Directors: Prashanth R Vihari, Shravan Bharadwaj
Co-Producers: Ramesh Veeragandhan, Ravali Kalangi
Producers: Akhilesh Vardhan & Srujan Yarabolu
Writer, Director: Harsha Pulipaka

Tags

Related Articles

Back to top button
Close
Close