Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

ప్రేమ, విధేయత కలిసినప్పుడు

Prēma, vidhēyata kalisinappuḍu kuṭumbamē anniṭikaṇṭē pedda balagaṁ

కుటుంబమే అన్నిటికంటే పెద్ద బలగం 

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని  ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోమవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా ఊరి వాతావరణం, కల్మషం లేని మనస్తత్వాలను చూపించారు. ఇక ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఊర్లోని ఓ ఇంట్లో అశుభం జరిగితే.. ఊరంతా ఎలా స్పందిస్తుంది.. బంధుగణం ఎలా ప్రవర్తిస్తుంది.. అంటూ ఈ ట్రైలర్‌లో ఎంతో చక్కగా చూపించారు. ‘మీరేమైనా మనుషులేనారా.. ఇజ్జత్ పోతాంది కదరా.. ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటాండ్రా’ అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన డైలాగ్‌ కథ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది.

ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్. తెలంగాణ నేపథ్యాన్ని ఎంతో సహజంగా చూపించారు’ అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ను స్థాపించాం. బలగం సినిమా అందరినీ కదిలిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది’ అని అన్నారు.

వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు.

Tags

Related Articles

Back to top button
Close
Close