EventEvents/PressmeetsMOVIE NEWSSpecial Bites

వీరభద్రమ్ చౌదరి – నరేష్ అగస్త్య- డెక్కన్ డ్రీమ్ వర్క్స్- దిల్ వాలా టాకీ పూర్తి – ఏప్రిల్ లో విడుదల

Veerabhadram Chaudhary - Naresh Agastya - Deccan Dream Works - Dilwala Talky Complete - Released in April

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘దిల్ వాలా’. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వైజాగ్ లో కంటిన్యూస్ గా 20 రోజుల షూటింగ్ తో టాకీ పార్ట్  పూర్తి చేసుకుంది.

వైజాగ్ షెడ్యుల్ లో నరేష్ అగస్త్య,  రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, సెకండ్ హీరోయిన్ ప్రగ్యా నైనా, అలీ రెజాల పై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుంది. ఈ రెండు పాటలని బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు. వైజాగ్ లో రుషికొండ, తొట్లకొండ బీచ్, యారాడ బీచ్ , అరకు లాంటి అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. అవుట్ డోర్ షూటింగ్ కి వైజాగ్ అన్ని విధాల అనుకూలంగా వుంది’’ అని అన్నారు.

ప్రముఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి.  అనూప్ రూబెన్స్ బ్యూటీఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేశారు.  ఈ చిత్రానికి  కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

తారాగణం:
హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి,  ప్రగ్యా నైనా , రాజేంద్ర ప్రసాద్, అలీ రెజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష, రాజా రవీంద్ర, గిరిధర్, అవినాష్, జబర్దస్త్ చంటి, ఎంవివి సత్యనారాయణ, శ్రీదేవి, విహారిక తదితరులు.

టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి  
నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్
బ్యానర్స్ :   డెక్కన్ డ్రీమ్ వర్క్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు: శంకర్
కెమరా : అనిత్
ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర
ఎడిటర్ : చోటా కె ప్రసాద్
కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు
పీఆర్వో : వంశీ- శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close