
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, నూతన దర్శకుడు యలమంద చరణ్, హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా కామెడీ డ్రామా ‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ వేణు ఉడుగుల
Sunil, Srinivas Reddy, Vennela Kishore, Dhanraj, Debutant Yalamanda Charan, Himalaya Studio Mansions, Mirth Media Comedy Drama 'Bhuvana Vijayam' First Look Launched by Director Venu Udugula

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’.
వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్ లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్ లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది.
శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
తారాగణం: సునీల్ ,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ , వైవా హర్ష , బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ , గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ ,సోనియా చౌదరి, స్నేహల్ కామత్ , షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు
టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: యలమంద చరణ్
బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా
నిర్మాతలు: కిరణ్, విఎస్కే
సమర్పణ: శ్రీమతి లక్ష్మి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సాయి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో : తేజస్వి సజ్జ
Regards,
Tejaswi Sajja