EventMOVIE NEWSSpecial Bites

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ పూర్తి

Vishwak Sen, Niveda Pethuraj, Vanmaye Creations, Vishwaksen Cinemas 'Das Ka Dhamki' shooting complete

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత  నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. నేటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇప్పటివరకూ విడుదలైన  ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.   ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల,  మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
సాంకేతిక  విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close