MOVIE NEWSNEWSSpecial Bites

సీనియర్ నటుడు ప్రభుకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Senior actor Prabhu is ill.. admitted to hospital

ప్రభాస్ తండ్రిగా చేసిన ప్రభు అందరికీ సుపరిచితమే

సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు.

ప్రభుని పరీక్షించిన వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రభు ఆర్యోగం ప్రస్తుతం నిలకడగా ఉందని, లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు.

మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా తమిళ నటుడైన ప్రభు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడు. తెలుగులో ఆయన చంద్రముఖి, డార్లింగ్‌, శక్తి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రభాస్‌కు డార్లింగ్‌ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రభు దళపతి విజయ్‌ వారసుడు చిత్రంలో కనింపించారు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close