
SS రాజమౌళి చేతులమీదుగా MM శ్రీలేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ఆవిష్కరణ.
MM Srilekha World Music Tour poster unveiled by SS Rajamouli.

ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ 2023 మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పోస్టర్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం డైరెక్టర్ SS రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో,5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ mm శ్రీలేఖ, తన అచీవ్‌మెంట్స్ కి అభిననందనలు అందించారు.
ఆస్కార్ కు వెళుతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలి సీరియల్ “శాంతినివాసం” కి తాను మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బానర్ ద్వారా Investor Groves Pvt. Ltd. సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు
PRO.: Vasu Sajja