Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

పార్వ‌తీశం, జ‌ష్విక జంట‌గా న‌టించిన న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరి ‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ లవ్ మెలోడీని రిలీజ్ చేసిన స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి

New-age platonic love story 'Telusa Manasa' stars Parvateesam, JashvikaLove melody 'Manasu Manasu Tho' from the movie unveiled by Bobby Kolli

కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం, జ‌ష్విక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించారు. వైభ‌వ్ ద‌ర్శ‌కుడు. పార్వ‌తీశం ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మ‌ల్లి బాబు పాత్ర‌లో న‌టించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర‌లో జ‌ష్విక న‌టించింది. వారిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. మ‌రీ ముఖ్యంగా మ‌ల్లిబాబు అయితే ప‌లు సంద‌ర్భాల్లో సుజాత‌కు త‌న ప్రేమ‌ను చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఇద్ద‌రూ అనుకోని కార‌ణాల‌తో దూర‌మ‌వుతారు. మ‌రి వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారా? అనేది ‘తెలుసా మనసా’  సినిమా క‌థాంశం.

మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుద‌లైంది. వాల్తేరు వీర‌య్య‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి ఈ పాట‌ను విడుద‌ల చేసి.. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.  

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌రోసారి ఈ పాట‌లో ఆయ‌న త‌న‌దైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. నిజ‌మైన ప్రేమ‌లోని లోతును ఆవిష్క‌రించేలా, హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సు మ‌న‌సుతో పాట  ఉంది. వ‌న‌మాలి రాసిన ఈ పాట‌ను శ్రీకృష్ణ అద్భుతంగా ఆల‌పించారు. ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్ర‌ఫీ ఈ పాట‌కు మ‌రింత అందాన్నిచ్చింది.

డెబ్యూ డైరెక్ట‌ర్ వైభ‌వ్ .. ‘తెలుసా మనసా..’ చిత్రాన్ని న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరిగా అద్భుతంగా మ‌లుస్తున్నార‌ని త్వ‌ర‌లోనే మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

న‌టీన‌టులు:

పార్వ‌తీశం, జ‌శ్విక‌, రోహిణి హ‌ట్టంగ‌డి, మ‌హేష్ అచంట‌, అలీ రెజా, లావ‌ణ్య‌, మాస్ట‌ర్ అద్వితేజ్‌, వెంకీ, శివ‌, శోభ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌:  శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ‌:  నైనీష్య‌, సాత్విక్‌
నిర్మాత‌లు: వ‌ర్ష ముండాడ, మాధ‌వి
స్టోరి – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్ష‌న్‌:  వైభ‌వ్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  గిరిధ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ప్ర‌సాద్ ఈద‌ర‌
ఎడిట‌ర్‌:  కె.ఎ.వై.పాపారావ్‌
మ్యూజిక్‌:  గోపి సుంద‌ర్ సి.ఎస్‌
పాట‌లు:  వ‌న‌మాలి, కాస‌ర్ల శ్యామ్‌, శ్రేష్ట‌
సింగ‌ర్‌:  రాహుల్ సిప్లిగంజ్‌, శ్రీరామ‌చంద్ర‌, ర‌మ్య బెహ్ర‌, శ్రీకృష్ణ‌, మాళ‌విక‌, సుధాంశు
ప‌బ్లిసిటీ డిజైన్స్‌:  టి.ఎస్‌.ఎస్‌.కుమార్‌
పి.ఆర్‌.ఓ:  నాయుడు సురేంద్ర – ఫ‌ణి (బియాండ్ మీడియా

——————————————-

New-age platonic love story ‘Telusa Manasa’ stars Parvateesam, JashvikaLove melody ‘Manasu Manasu Tho‘ from the movie unveiled by Bobby Kolli

‘Kerintha’ fame Parvateesam and Jashvika pair up for Sri Balaji Pictures’ new-age platonic love story ‘Telusa Manasa’, written and directed by Vaibhav. Producers Varsha Mundada and Madhavi are bankrolling it. This village-based story has Parvateesam in the role of a balloon-seller named Malli Babu, while Jashvika will be seen as Sujatha, a health assistant. They fall in love with each other and despite their reciprocal feelings, they struggle to confess their love for each other due to inhibitions. Much as Malli Babu tries his best to express himself to Sujatha on several occasions, he fails to. All of a sudden, the castles that Mallli Babu built in the air collapse. Distance grows between him and Sujatha. Did they ever meet again in life? That’s the crux of the story of ‘Telusa Manasa’.

Days after star producer Dil Raju released the film’s first look poster, ‘Waltair Veerayya’ sensation Bobby Kolli on Tuesday unveiled a lovely song titled ‘Manasu Manasu Tho’. The star filmmaker wished the team of the movie all the best.

The perfect Valentine’s Day song is one of the best compositions from Gopi Sundar, the star composer of super-hit albums like ‘Ninnu Kori’. Sri Krishna’s voice is soothing. Vanamali’s lyrics are laced with depth. The lines are about the joy of the lover boy over meeting his soulmate. He is buoyed by the new dawn of his life and sings in awe of the new-found relationship. Prasad Edara’s cinematography adds a degree of charm.

The song makes us believe that the National Award-winning music director has dished out one of the best sets of tunes for ‘Telusa Manasa’.

Debutant director Vaibhav is carving the movie as a new-age love story. More details concerning the movie will be revealed soon.

Cast:

Parvateesam, Jashvika, Rohini Hattangadi, Mahesh Achanta, Ali Reza, Lavanya, Master Advitej, Venky, Shiva, Shoban and others.

Crew:

Banners: Sri Balaji Pictures
Presenter: Nyneishia & Saatvik
Producers: Varsha Mundada, Madhavi
Story, screenplay, dialogues, direction: Vaibhav
Co-producer: Giridhar
Cinematographer: Prasad Edara
Editor: KAY Paparao
Music director: Gopi Sundar
Lyricists: Vanamali, Kasarla Shyam, Sreshta
Singers: Rahul Sipligunj, Sri Ramachandra, Ramya Behara, Sri Krishna, Malavika, Sudhanshu
Publicity Designs: TSS Kumar
PRO: Naidu Surendra-Phani (Beyond Media)

Tags

Related Articles

Back to top button
Close
Close