MOVIE NEWSSpecial Bites

రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘ప్రాణాన పాటలే పాడుతుంది’ విడుదల

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP Release 'Rudrudu' First Single 'Pranana Patale Padadu'

మల్టీ ట్యాలెంటెడ్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’ విడుదలకు సిద్ధమౌతోంది.  ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ‘ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘ప్రాణాన పాటలే పాడుతుంది’ పాటని ఈ రోజు విడుదల చేశారు. వీర తిరుమగన్ చిత్రంలో‘‘పాడాద పాటెలం’ క్లాసిక్ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేసి ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ గా ప్రజంట్ చేశారు. ధరన్ కుమార్ ఈ పాటని ఎక్స్ ట్రార్డినరీగా రిక్రియేట్ చేయగా.. రాకేందు మౌళి ఈ పాటకు అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో లారెన్స్ డ్యాన్స్ మూవ్స్ మెస్మరైజ్ చేశాయి.  

ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.

రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

సాంకేతిక విభాగం:
నిర్మాత, దర్శకత్వం – కతిరేశన్,
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి
ఎడిటర్: ఆంథోనీ
స్టంట్స్: శివ – విక్కీ
పీఆర్వో: వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close