MOVIE NEWSSpecial Bites

ఆది సాయికుమార్ ‘సిఎస్ఐ సనాతన్’ థ్రిల్లింగ్ ట్రైలర్ విడుదల!!

Aadi Saikumar's 'CSI Sanathan' thrilling trailer released!!

హీరో ఆది సాయికుమార్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “సీఎస్ఐ సనాతన్” ట్రైలర్ విడుదల. సి య‌స్ ఐ ఆఫీస‌ర్ గా ఆది కనిపించనుండగా మిషా నారంగ్ హీరోయిన్ గా నటించింది.

మర్డర్ మిస్టరీ గా శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ లో మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ట్రైలర్ మొదలవ్వగానే విక్రమ్ చక్రవర్తి అనే కార్పరేట్ లీడర్ ప్రసంగిస్తూ భారత ఆర్ధిక వ్యవస్థ ని ఎత్తున నిలబెట్టడమే తన లక్ష్యం అని చెబుతుంటాడు. ఆ వెంటనే అతను చనిపోయి కనిపిస్తాడు. సనాతన్ ఈ మిస్టరీ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ 5 నిందితులని అరెస్ట్ చేసి తన శైలిలో విచారిస్తాడు. ఒక మహిళ అతను చాలా మంచివాడని చెప్పడం, ఇంకొకరు అతను ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పడం ఇలా చిత్ర విచిత్రమైన సన్నివేశాల మధ్య ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిజాన్ని అస్సలు ఊహించలేము అని హీరో అంటుండగా ‘ఒక ప్రాణానికి ఇంకో ప్రాణం’ లాంటి పదాలతో ఉత్కంఠ భరితంగా ట్రైలర్ సాగుతుంది.

మర్చి 10న థియేటర్లలో విడుదలవనున్న ఈ
చిత్ర విజయంపై నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.

న‌టీన‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్,  వాసంతి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం –
సినిమాటోగ్ర‌ఫీ: జి. శేఖ‌ర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జి ఎస్ కె మీడియా
నిర్మాత: అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు: శివ‌శంక‌ర్ దేవ్

Tags

Related Articles

Back to top button
Close
Close