
విజయ్ ఆంటోనీ “బిచ్చగాడు 2” నుండి మొదటి నాలుగు నిమిషాల ఫుటేజ్ రిలీజ్. సమ్మర్ లో రిలీజ్ కానున్న మూవీ
The first four minutes of footage from Vijay Antony's "Bichchagadu 2" has been released. Movie to be released in summer

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా “బిచ్చగాడు”. ఈ సినిమా సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది.
గతంలో విడుదలైన ఈ సినిమా నుండి మొదటి నాలుగు నిమిషాల ఫుటేజ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బిచ్చగాడు 2 చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.
దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం,
ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.