
మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న కామెడీ హారర్ ”ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” సినిమా రిలీజ్
On the occasion of Maha Shivratri, the comedy horror movie "Oo Antava Maava Ooo Antava Maava" will be released on February 18.


యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ హారర్ చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా
నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. .ఈ సినిమాను కాశ్మీర్, హైదరాబాద్ పలు చోట్ల షూటింగ్ జరుపు కున్నాము. నిన్నే ఫస్ట్ కాపీ చూశాము.మంచి అద్భుతమైన కంటెంట్ వచ్చింది. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ కి 76 సూపర్ హిట్స్ ఇచ్చాడు. అలాంటి తన దర్శకత్వంలో వస్తున్న ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” .సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది.జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఈ మధ్య యాడ్ షూటింగ్స్ లలో బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ మొదలగు వారంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. కాశ్మీర్ లో షూటింగ్ చేసిన వీడియో పుటేజ్ చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఈ సినిమాను పలువురు ఇండస్ట్రీ పెద్దలకు చూయించడం జరిగింది. చూసిన వారంతా చాలా బాగుందని రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు.కాబట్టి ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాము అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.








నటీ, నటులు
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్
ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్
దర్శకత్వం : రేలంగి నరసింహారావు
కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ
సంగీతం: సాబు వర్గీస్,
కెమెరా: కంతేటి శంకర్
ఎడిటర్ : వెలగపూడి రామారావు
మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్
పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్
ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్
చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి
కో డైరెక్టర్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు
ప్రొడక్షన్ డిజైనర్ : గోలి వెంకటేశ్వర్లు