MOVIE NEWSSpecial Bites

ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్ జంటగా నటించిన ‘శశివదనే’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్

Harish Shankar released the title song of Rakshit Atluri and Komali Prasad's 'Sasivadane'

ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే’. గౌరీ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.ఎస్. క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. త్వ‌ర‌లో సినిమా విడుదల కానుంది. ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు. హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ ‘శశివదనే’ పాట‌కు కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించారు. 

టైటిల్ సాంగ్ విడుదల చేసిన అనంతరం హరీష్ శంకర్ మాట్లాడుతూ ”ముందుగా సంగీత దర్శకుడు శరవణన్ కు కంగ్రాట్స్. చాలా రోజుల తర్వాత మంచి శాస్త్రీయ సంగీతాన్ని విన్నాను. మంచి తెలుగు టైటిల్ పెట్టారు. నాకు బాగా నచ్చింది. శశివదనే అంటే మంచి చంద్రబింబం లాంటి ముఖం ఉన్న అమ్మాయి అని అర్థం. ఆల్ ది బెస్ట్ టు రక్షిత్, కోమలి. వాళ్లిద్దరి కెమిస్ట్రీ బావుంది. నిర్మాత అహితేజ, అభిలాష గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్. ఒక్క సంగీతమే కాదు, సినిమాలో కూడా తెలుగు నేటివిటీ ఉంది. ‘చేతిలో చెయ్యి వేస్తే నువ్వు గీతలే మారవా?’ అని పాటలో లైన్ కూడా నాకు బాగా నచ్చింది. విజువల్స్ బావున్నాయి. మంచి సాహిత్యం, మంచి సంగీతంతో కూడిన చిత్రమిది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. 

రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ”మా సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. సాంగ్ చాలా వచ్చింది. కోమలీ గారు అద్భుతంగా చేశారు” అని అన్నారు. 

కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ ”హరీష్ శంకర్ వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనకు సాంగ్ నచ్చడం మా ఫస్ట్ సక్సెస్. దర్శకుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, వీళ్ళందరినీ వెనుక ఉండి నడిపించిన నిర్మాతలు… ఎవరు లేకపోయినా ఇంత అందంగా సాంగ్ వచ్చేది కాదు. నాకు వాటర్ ఫోబియా ఉంది. అయితే సాంగ్ అంతా బోటు ఎక్కించారు. రక్షిత్ లేకపోతే సాంగ్ ఇలా వచ్చేది కాదు” అని అన్నారు.  నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ ”మేం అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేయడానికి అంగీకరించిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. ఈ పాటను ఆయనతో విడుదల చేయించడానికి కారణం ఏమిటంటే… ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మ్యూజిక్, లిరిసిస్టులకు క్రెడిట్ ఇస్తూ మాట్లాడతారు. ఆయన మాస్ సినిమాలు చేస్తున్నా ఇళయరాజా గారు అంటే అభిమానం. సోషల్ మీడియాలో ఆయన్ను చూస్తూ ఉంటాను. ఇళయరాజా గారి రేంజ్ కాకపోయినా ఆ టచ్ ఉన్న సాంగ్ ఇది. ఆయనకు థాంక్స్. చాలా రోజుల తర్వాత ఇంగ్లీష్ పదం లేకుండా పూర్తిగా తెలుగు పదాలు ఉన్న సాంగ్ రాసిన కిట్టూ విస్సాప్రగడ గారికి థాంక్స్” అని అన్నారు.  

దర్శకుడు సాయి మోహ‌న్ ఉబ్బ‌న‌ మాట్లాడుతూ ”మా ‘శశివదనే’ టీమ్ ను, మా చిన్న సినిమాను విష్ చేస్తూ మా సాంగ్ లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. మా సంగీత దర్శకుడికి కూడా థాంక్స్. మంచి సాంగ్ ఇచ్చాడు. ఈ ఒక్క సాంగే కాదు, మిగతా పాటలు దీన్ని మించి ఉంటాయి. లిరిసిస్ట్ కిట్టు గారు ప్రతి పదం అర్థం అయ్యేలా, ప్రతి పదానికి మీనింగ్ ఉండేలా రాశారు. కొత్త దర్శకుడైన నన్ను సపోర్ట్ చేసిన హీరో హీరోయిన్లు, నిర్మాతలకు థాంక్స్” అని అన్నారు. 

శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ ”హరీష్ శంకర్ గారు లాంటి పెద్ద దర్శకుడు మా పాట విడుదల చేయడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అవకాశం ఇచ్చిన అహితేజ, గౌరీ గార్లకు థాంక్స్. ఎంతో సపోర్ట్ చేసిన రక్షిత్, కోమలీ గారికి థాంక్స్. అందరికీ సాంగ్ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు 

రక్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్‌, క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

సాంకేతిక వ‌ర్గం:

పి.ఆర్‌.ఓ:  సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌, కలరిస్ట్ – పంకజ్ సారధి స్టూడియోస్, సి.ఈ.ఓ: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  శ్రీపాల్ చోలేటి, సినిమాటోగ్రాఫ‌ర్‌:  సాయికుమార్ దార‌, పాట‌లు:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, మ్యూజిక్‌:  శ్ర‌వ‌ణ వాసుదేవ‌న్‌, స్టంట్స్‌:  జాషువా – జీవ‌న్‌, కాస్ట్యూమ్స్ – స‌మ‌ర్ప‌ణ‌:  గౌరీ నాయుడు, నిర్మాత‌:  అహితేజ బెల్లంకొండ‌, రైట‌ర్ – డైరెక్ట‌ర్‌:  సాయి మోహ‌న్ ఉబ్బ‌న‌.

—————————–

Melodious love song from Rakshit Atluri – Komalee Prasad’s ‘Sasivadane’ is soulful

Title song ‘Sasivadane’ unveiled by Harish Shankar

Young actor Rakshit Atluri is doing ‘Sasivadane’, which is a love and action drama set in the backdrop of Godavari. Presented by Gauri Naidu, the film marks the coming together of SVS Constructions Pvt. Ltd. and AG Film Company. Rakshit Atluri and Komalee Prasad are its lead pair, while Praveen Yendamuri, Tamil actor Sriman, Kannada actor Deepak Prince, and Jabardasth Bobby have got important roles. Directed by Saimohan Ubbana and produced by Ahiteja Bellamkonda, the film is gearing up for a theatrical release soon.

Star director Harish Shankar today unveiled the title song from the promising movie. “Very Happy to release such a beautiful & evergreen melody #Sasivadane. All the best to the entire team  (sic),” the ‘Ustaad Bhagat Singh’ director tweeted.

A soulful song, it is shot on the lead pair. Kittu Vissapragada’s lyrics tap into the pure nature of the love between the hero and heroine. The melody has been sung by the Hari Charan-Chinmayi Sripada duo and their beautiful rendition suggests that the lead pair are going through a transcendental experience in the backdrop of real locations like a temple.

Saravana Vasudevan’s music is a vintage melody that attempts to conquer your hearts and playlists. The picturization is the icing on the cake, accentuated by self-absorbed performances.

The film was shot in picturesque locations across Konaseema, Amalapuram over a span of 50 days.

Cast and crew:

Rakshit Atluri, Komalee Prasad, Deepak Prince.

PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media); Editor: Garry BH; Colourist: Pankaj Halder (Saradi Studios); CEO: Asish Peri; Executive Producer: Sripal Cholleti; Cinematographer: Saikumar Dara; Lyricists: Kittu Vissapragada, Karunakar Adigarla; Music Director: Saravana Vasudevan; Stunts: Joshua-Jeevan; Costumes-Presentation: Gauri Naidu; Producer: Ahiteja Bellamkonda; Writer-Director: Saimohan Ubbana.

Tags

Related Articles

Back to top button
Close
Close