
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ‘అమిగోస్’ చిత్రం నుంచి ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’కి రీమిక్స్ సాంగ్ రిలీజ్
Remix song release of the iconic romantic song 'Enno ratrulozaingani..' from the film 'Amigos' produced by Mythri Movie Makers starring Nandamuri Kalyan Ram.

డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి.
మంగళవారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మ క్షేత్రం సినిమాలో ఎవర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్. ధర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాటను ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాటకు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయన తనయుడు ఎస్.పి.బి.చరణ్ ఆలపించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్.పి.బి.చరణ్‌తో పాటు సమీర భరద్వాజ్ ఆలపించారు. ఇళయ రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మనల్ని మరో ప్రపంచలోకి తీసుకెళుతుంది.
ఈ వీడియో సాంగ్ కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ మధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చక్కగా ఎలివేట్ చేస్తుంది. చక్కటి ట్యూన్‌కి తగ్గ సాహిత్యం, విజువల్స్ ఆడియెన్స్ కళ్లకు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మరింత అందంగా కనిపిస్తుంటే.. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం దక్కించుకుంటుందనటంలో సందేహం లేదు.
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.