
Malikappuram Movie Review అయ్యప్పస్వామి ట్రావెలాగ్.. ఆకట్టుకొన్న దేవ నందా, ఉన్ని ముకుందన్
Malikappuram Movie Review

Rating: 2.5/5
నటీనటులు: ఉన్ని ముకుందన్, సంజూ కురుప్, దేవ నందా, సంపత్ రామ్, శ్రీపత్ తదితరులు
దర్శకత్వం: విష్ణు శశి శంకర్
కథ: అభిలాష్ పిళ్లై
నిర్మాత: నీతూ పింటో, ప్రియా వేణు
సినిమాటోగ్రఫి: విష్ణు నారాయణ్
ఎడిటింగ్: విష్ణు శశి శంకర్
మ్యూజిక్: రంజిన్ రాజ్
బ్యానర్: గీతా ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2023-01-26
ఆరేళ్ల షన్నూ (దేవ నందా) కు అయ్యప్ప స్వామి అంటే చెప్పలేనంత ఇష్టం. శబరిమలైలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవాలనే కోరికను తండ్రితో కోరుకొంటుంది. తన కూతురును అయ్యప్పస్వామి వద్దకు తీసుకెళ్తాడని మాట ఇస్తాడు. అయితే కూతురు కోరిక తీర్చకుండానే తండ్రి ఓ కారణంగా మరణిస్తాడు.

షన్నూ తండ్రి మరణం ఎలా సంభవించింది? అయ్యప్పస్వామిని దర్శించుకోవాలనే కోరిక షన్నూకు తీరిందా? దేవుడిని దర్శించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడింది? అయ్యప్పను దర్శించుకోవాలనే కోరిక ఎందుకు బలంగా మారింది? షన్నూ కోరికను అయ్యప్పన్ (ఉన్ని ముకుందన్) ఎలా తీర్చాడు? అసలు అయ్యప్పన్ ఎవరు? షన్నూకు అయ్యప్పన్ ఎందుకు సహకరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాలికాపురం సినిమా కథ. సాధారణంగా అయ్యప్ప మాల వేసుకొనే మగపిల్లలను కన్నె స్వామి అంటారు. అదే విధంగా తొలిసారి అయ్యప్పను సందర్శించుకొనే బాలికలను మాలికాపురం అంటారు. షన్నూ మాలికాపురంగా మారి అయ్యప్పను సందర్శించుకోవాలను కోవడంతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. అయితే తండ్రి ఊహించని విధంగా చనిపోవడం షన్నూను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. అయ్యప్పస్వామి తన తండ్రిని దగ్గరకు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పడంతో షన్నూ కోరిక మరింత బలంగా మారుతుంది. ఇంట్లో చెప్పకుండా స్కూల్‌లో తన స్నేహితుడిని తీసుకొని వెళ్లడం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.

అయ్యప్పస్వామిని దర్శించుకొనేందుకు వెళ్లిన షన్నూను ఓ వ్యక్తి వెంటాడటం, ఆ క్రమంలో అయ్యప్పన్ వారికి అండగా నిలువడం లాంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఇది సినిమా అనడం కంటే..అయ్యప్పస్వామిని ఎలా సందర్శించాలి. ఆ ప్రాంతం విశిష్టతను గురించి చెప్పే ట్రావెలాగ్ మాదిరిగా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్, ఉన్ని ముకుందన్ ప్రజెన్స్ సినిమాకు సానుకూలంగా మారింది.

షన్నూగా దేవ నందా అద్బుతంగా నటించింది. చిన్న వయసులోనే భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నది. సినిమా కథను తన భుజాలపై మోసింది. ఇక ఉన్ని కృష్ణన్ తనదైన శైలిలో మెప్పించాడు. ఉన్ని పాత్ర ఎంట్రీతో సినిమా కథ పరుగులు పెడుతుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విష్ణు నారాయణన్ సినిమాటోగ్రఫి, రింజిన్ రాజ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. తెలుగులో అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.

మాలికాపురం పలు అంశాలతో సాగే డివోషనల్ జర్నీ. దేవ నందా, ఉన్ని ముకుందన్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. అయ్యప్పస్వామి సందర్శన ఎలా చేసుకోవాలనే విధంగా ట్రావెలాగ్‌లా ఉంటుంది. శబరిమలై వద్ద ఉన్న ప్రాంతాల విశిష్టతను గురించి చెప్పే భక్తి ప్రధాన చిత్రంగా రూపొందింది. అయ్యప్ప భక్తులు, దైవభక్తి ఉన్న వారు ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.