MOVIE NEWSSpecial Bites

శాకుంతలం’ మూవీ నుంచి దుష్యంతుడు, శకుంత‌ల మ‌ధ్య ప్రేమను తెలియ‌జేసే రొమాంటిక్ సాంగ్ ‘ఋషి వ‌నంలోన‌…’

Samantha's Shaakuntalam Second Single Rushivanamlona is a delight to both ears and eyes

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం చిత్ర యూనిట్ ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వ‌నంలోన‌…’ పాటను విడుద‌ల చేశారు. మెలోడి బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించటంతో మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన శైలిలో అంద‌మై బాణీల‌ను ప‌లికించారు. దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ పాట‌లో క‌నిపించే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపింప చేస్తుంది. ఈ ఇన్‌టెన్స్ క్యాచీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్‌, చిన్మయి ఎంతో శ్రావ్యంగా ఆల‌పించారు. శ్రీమ‌ణి పాట‌ను రాశారు. దేవ్ మోహ‌న్‌, స‌మంత మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది.

శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

&&&&&&&&&&

Samantha’s Shaakuntalam Second Single Rushivanamlona is a delight to both ears and eyes

Guna Shekar, a supremely talented filmmaker is coming with the stunning romantic saga Shaakuntalam on the big screen after a long time. Starring Samantha in the titular role, the film has Malayalam actor Dev Mohan in Dushyant character.

Produced by Neelima Guna and presented by ace producer Dilraju, the film currently at the post-production stage. Already the trailer took the expectations bar a notch higher and now the makers are busy treating the netizens with melodious singles. The first lyrical video of the “Mallika” song was just awesome and now, the second single “Rushivanamlona” unveiled today.

This song has a soothing tune that captures your heart. Sid Sriram and Chinmayi’s soft and mellifluous vocals puts everyone in trance. Melody has always been a forte of Melody Brahma Mani Sharma and it’s at full display in ‘Rushivanamlona’, a soothing melody number featuring Shaakuntala and King Dushyant.

The picturesque forest backrop with classy visuals will impress everyone. An instantly catchy song, sung by Sid Sriram and Chinmayi, has lyrics written by Shreemani. Samantha and Dev Mohan chemistry looks magical in the song. This song also released in other languages and it sounds as good as original.

The much awaited Shaakuntalam which is based on internationally acclaimed Kalidasa’s Sanskrit play ‘Abhijnana Shakuntalam’ is all set to release on February 17th, 2023 in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada. The film will be released in 3D so that audience can experience the Gunasekhar visual magic.

The film has Mohan Babu, Prakash Raj, Gautami, Aditi Balan, and Ananya Nagalla in pivotal roles. The film is bankrolled under Gunaa Teamworks in collaboration with Sri Venkateswara Creations. Melody Brahma Manisharma is scoring music for the film.

Shaakuntalam is written and directed by Gunasekhar. Sai Madhav Burra penned the dialogues for the film. Sekhar V Joseph is the cinematographer, and Prawin Pudi is the editor.

Tags

Related Articles

Back to top button
Close
Close