Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

‘పాప్ కార్న్’ మూవీ నుంచి ‘మది విహంగమయ్యే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన అక్కినేని నాగ చైతన్య

'Popcorn': 'Madhi Vihangamayye' song is a picture of joy Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు హీరో నాగ చైత‌న్య‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

పాట‌ను గ‌మ‌నిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వారి ఆలోచ‌న‌లు.. ఎంత వేగంగా వారి భ‌విష్య‌త్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయ‌నే విష‌యాన్ని చ‌క్క‌టి లిరిక్స్‌తో పాట‌లో పొందు ప‌రిచారు లిరిక్ రైట‌ర్ శ్రీజో. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో మ‌ది విహంగ‌మ‌య్యే.. పాట‌ను బెన్నీ ద‌యాల్‌, ర‌మ్యా బెహ్రా చ‌క్క‌గా ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ ‘‘‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివ‌రి 45 నిమిషాలు అయితే  సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్ద‌ల‌కు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వ‌స్తుంది. ఇప్ప‌టి యువ‌త‌కు కూడా క‌నెక్ట్ అవుతుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్  ఉన్న సినిమా. డైరెక్ట‌ర్ ముర‌ళి గంధం టేకింగ్‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా అప్రిషియేట్ చేస్తారు’’ అన్నారు.

సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న పాప్ కార్న్‌తో సంద‌డి చేయ‌బోతున్నాం’’ అన్నారు.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్ష‌కులు సినిమాలోకి లీన‌మైపోతారు. ఇక చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా మూవీ అల‌రిస్తుంది’’ అన్నారు.

‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.

న‌టీన‌టులు:

అవికా గోర్‌, సాయి రోన‌క్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌:  ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌:  భోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ – స్టోరి – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం:  ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌:  అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిట‌ర్‌:  కె.ఎస్‌.ఆర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  భాస్క‌ర్ ముదావ‌త్‌, కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ సాయి, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌:  మ‌నోహ‌ర్ పంజా, పి.ఆర్.ఓ:  నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా), పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌:  నియో స్టూడియోస్‌, డిజిటల్ మార్కెటింగ్‌:  మ్యాంగో మీడియా, మ్యూజిక్‌: ఆదిత్య మ్యూజిక్‌.

—————————————–

‘Popcorn’: ‘Madhi Vihangamayye’ song is a picture of joy

Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10

Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10.

Recently, the film’s trailer was released at the hands of Akkineni Nagarjuna. It showed that ‘Popcorn’ is content-oriented as well as fun-filled.

Today, an enjoyable song titled ‘Madhi Vihangamayye’ has been released via Aditya Music. Sreejo’s enjoyable lyrics are among its merits. Set in a shopping mall, its dance choreography brings out the joyous mood of the lead pair – both Sai Ronak and Avika Gor dance to their heart’s content.

Singers Benny Dayal and Ramya Behra render the song in such a way that their vocals reflect the elated mood of the actors. Shravan Bharadwaj, one of the most talented contemporary musicians, lets his work do the talking.

Presenter MS Chalapathi Raju is confident that the film’s last 45 minutes are going to keep the viewer hooked to the screens. “Elders will reconnect with their past, while youngsters will have a blast watching the film. The movie tells the story of a dramatic, emotional journey of two characters,” he recently said. Debutant director Murali Gandham’s treatment is going to make a lot of difference, the makers suggested.

“The concept of this film is different. Everything about it is different. I thank the Telugu audience for always supporting me. ‘Popcorn’ is entirely different from my previous films,” Avika Gor recently said. She is one of the producers of the movie.

“The story of this film takes place in a lift. And it is going to draw your attention completely within 10 minutes. The climax will completely be edge-of-the-seat. I myself am thrilled about it,” Sai Ronak added.

Cast:

Sai Ronak, Avika Gor.

Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Music Director: Shravan Bharadwaj; Production Designer: Bhaskar Mudavath; Costume Designer: Manohar Panja; Editor: Karthik Srinivas; Cinematographer: MN Bal Reddy; Co-Producers: Avika Gor, MS Chalapathi Raju, Seshu Babu Peddinti; Producer: Bhogendra Gupta; Story, Screenplay, Dialogues, Direction: Murali Naga Srinivas Gandham.

Tags

Related Articles

Back to top button
Close
Close