
MOVIE NEWSSpecial Bites
దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీసోదరుడు
దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీసోదరుడు
నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి ..
My brother to the Deva Brahmin brothers and sisters Nandamuri Balakrishna's heartfelt plea..

“అమరావతి
దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీసోదరుడు
నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి ..
దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన
దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ..
నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను ..
నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు , ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు ..
దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే ..
అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి
..పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు ..నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ?..
అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను
.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను ..
మీ సోదరుడు
నందమూరి బాలకృష్ణ