MOVIE NEWSSpecial Bites

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు విడుదల చేసిన అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్  

Legendary Director K Raghavendra Rao Launched The First Look Glimpse Of Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Maresh Shivan, Kommalapati Sai Sudhakar, Viision Movie Makers’ Ala Ninnu Cheri

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.  చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు రాఘవేంద్ర రావు.

ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ భావోద్వేగాలను చూడొచ్చు. హీరో దినేష్ తేజ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అతనితో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ రొమాంటిక్ రిలేషన్ హైలైట్ చేస్తూ ఈ వీడియో కట్ చేశారు. సుభాష్ ఆనంద్ తన ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. 

కొత్త సంవత్సరం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ అప్ డేట్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. 

నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు.

కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మారేష్ శివన్

నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్

బ్యానర్: విజన్ మూవీ మేకర్స్

సమర్పకుడు: కొమ్మాలపాటి శ్రీధర్

ఎగ్జిగుటివ్ ప్రొడ్యూసర్: కర్నాటి రాంబాబు

DOP: ఐ ఆండ్రూ

సంగీతం: సుభాష్ ఆనంద్

ఎడిటర్: కోటగీటి వెంకటేశ్వరరావు

కళ: విఠల్

సాహిత్యం: చంద్రబోస్

ఫైట్స్: కింగ్ సోలమన్, రామకృష్ణ (ఆర్కే)

కొరియోగ్రఫీ: భాను

కాస్ట్యూమ్ డిజైనర్: మదాసర్ మహమ్మద్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

PRO: సాయి సతీష్

Legendary Director K Raghavendra Rao Launched The First Look Glimpse Of Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Maresh Shivan, Kommalapati Sai Sudhakar, Viision Movie Makers’ Ala Ninnu Cheri

Feel-good romantic entertainers have a wide reach with youth as well as families adoring them to the core. Ala Ninnu Cheri is an upcoming feel-good romantic entertainer starring Dinesh Tej of Husharu fame in the lead with Hebah Patel and Payal Radhakrishna playing the leading ladies opposite him. Maresh Shivan is directing, while Kommalapati Sai Sudhakar is producing the movie under the banner of Viision Movie Makers. Kommalapati Sridhar is presenting it.

On the occasion of Sankranthi, the film’s first look glimpse has been unveiled. Legendary director K Raghavendra Rao did the honors of launching the first look glimpse. The video introduces the lead characters and the feel-good emotions between them. Payal is Divya, Hebah is Anu and Dinesh is Ganesh.

Dinesh Tej appeared in two different get-ups and the glimpse shows his romantic relationship with Hebah Patel and Payal Radhakrishna. The protagonist and his love interests look cool. Subhash Anand mesmerizes with his captivating background score.

The makers earlier on New Year released the first look and motion poster of the movie which received a good response. The glimpse brings positive vibes on the movie.

Maresh Shivan has also penned story, screenplay, and dialogues of the movie. Popular cinematographer- I Andrew is working for the movie, while Vithal is the art director. Lyrics are penned by Chandrabose. Karnati Rambabu is the ex-producer and Kotagiri Venkateshwara Rao is the editor. Shivakumar Ramachandravarapu and ‘Rangasthalam’ Mahesh are the other prominent cast.

The movie is fast progressing with its shoot and final schedule will begin soon.

Cast: Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Shivakumar Ramachandravarapu, ‘Rangasthalam’ Mahesh, Jhansi, Kedar Shankar and others.

Technical Crew:

Story, Screenplay, Dialogues, Direction: Maresh Shivan

Producer: Kommalapati Sai Sudhakar

Banner: Viision Movie Makers

Presenter: Kommalapati Sridhar

Ex-Producer: Karnati Rambabu

DOP: I Andrew 

Music: Subhash Anand

Editor: Kotagiti Venkateshwara Rao

Art: Vithal

Lyrics: Chandrabose

Fights: King Solomon, Ramakrishna (RK)

Choreography: Bhanu

Costume Designer: Madasar Mohammed

Publicity Designer: Dhani Aelay

PRO: Sai Satish

Tags

Related Articles

Back to top button
Close
Close