MOVIE NEWS
Trending

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ‌ క్లాప్ కొట్ట‌గా , నిర్మాత బ‌న్నివాసు కుమార్తే బేబి హ‌న్విక‌ స్విచ్ ఆన్ చేయ‌గా 18 పేజీలు ఓపేన్ చేసిన అల్లు అర‌వింద్‌, సుకుమార్‌, బ‌న్నివాసు, నిఖిల్‌

వరుస‌గా మంచి విజ‌యాలు సాధిస్తున్న నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్ లో ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ లు సంయుక్త నిర్మాణం లో నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్నారు. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ గారు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్ గా కుమారి 21ఎఫ్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో మ‌రో క్రేజి చిత్రం తో మ‌న‌ముందుకు వ‌స్తున్నాడు . ఈరోజు ప్రారంభ‌మైన “18 పేజీలు” చిత్రానికి అల్లు అర‌వింద్ గారు పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌గా..నిర్మాత బ‌న్నివాసు కుమార్తె బేబి హ‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ మెద‌టి షాట్ కి ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఈ చిత్రానికి గొపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అల్లు అర‌వింద్‌-నిఖిల్‌-బ‌న్నివాసు కాంబినేష‌న్‌

అల్లు అర‌వింద్‌-నిఖిల్‌-బ‌న్నివాసు కాంబినేష‌న్‌ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా గ‌తంలో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు అదే వూపుతో ఇప్ప‌డు అర్జున్ సుర‌వ‌రం లాంటి విజ‌యాలతో యూత్ లో క్రేజిస్టార్ గా పిలుచుకునే నిఖిల్ హీరోగా 18 పేజీలు అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మినిమ‌మ్ గ్యారంటి లేకుండా వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాజెక్టు ఒకే చెయ్యర‌ని తెలిసిన వారంతా ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు భారీగా పెంచుకున్నారు..

సుకుమార్‌-ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్‌

ఇంటిలెక్చువ‌ల్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ప్ర‌ధ‌మ‌స్థానం లో వుంటారు. ఆయన ఏ సబ్జెక్ట్ ట‌చ్ చేసినా ప్రేక్ష‌కుడి అభిరుచికి ద‌గ్గ‌ర‌గా వుంటుంది. అలాగే త‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎలాంటి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికి తెలుసు. మ‌న‌సులో ఏమి దాచుకొకుండా నిజాయితిగా ఓక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఏలా వుంటుందో చాలా చ‌క్క‌గా మ్యూజిక‌ల్ మ్యాజిక్ తో చూపిస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. మ‌ళ్ళి మరొ కొత్త ట్రెండింగ్ చిత్రం తో ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ రావ‌ట‌మేకాకుండా మెద‌ట‌గా చిత్రం టైటిల్ తోనే ఆక‌ట్టుకున్నారు. కొత్త టైటిల్ తోనే కాదు కొత్త క‌థ తో రానున్నారు. మ‌ర‌లా మ‌రో ఘ‌న‌విజ‌యానికి ఈరోజు ఈ కాంబినేష‌న్ తొ శ్రీకారం చుట్టారు

సాంకేతిక నిపుణులు..

జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్‌
అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌
సంగీతం- గొపి సుంద‌ర్‌
కెమెరా- యువ‌రాజ్‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌- బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌- శ‌ర‌ణ్ రాప‌ర్తి & అశోక్ .బి
ప్రోడక్ష‌న్ కంట్రోల‌ర్‌- వై. వీర‌బాబు
పిఆర్ ఓ – ఏలూరు శ్రీను
కొ-డైర‌క్ట‌ర్‌.. రాధా గోపాల్‌
నిర్మాత‌- బ‌న్ని వాసు
ద‌ర్శ‌క‌త్వం- ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్‌
క‌థ‌,స్క్రీన్‌ప్లే- సుకుమార్‌

“18 Pages’ launched as stylish star Allu Arjun’s daughter Arha sounds the first clap and Bunny Vas’s daughter, Baby Hansika switches on the camera, and Allu Aravind, Sukumar, Bunny Vas, and Nikhil in attendance

Nikhil has been picking the right subjects of late and he will be joining hands with successful producer, Bunny Vas for his upcoming film, ’18 Pages’ that was formally launched with a Pooja ceremony at Film Nagar temple today. Allu Aravind is presenting this film under GA 2 Pictures banner and Sukumar, who directed blockbusters like Rangasthalam is providing the story and screenplay for this film. Palnati Surya Pratap, who had previously directed a youthful entertainer, Kumari 21F is at the helm for this film. Stylish star Allu Arjun’s daughter Arha sounded the first clap and Bunny Vas’s daughter Hansika switched on the camera at the launch event. Sukumar directed the first shot. Gopi Sunder will be scoring the music for this film.

Allu Aravind-Nikhil-Bunny Vas combination

Allu Aravind, Nikhil, and Bunny Vas will be joining forces for ’18 Pages’ which will start rolling soon. Bunny Vas has already proven himself as an intelligent filmmaker with hits like Bhale Bhale Bhale Magadivoi, and Geetha Govindam. Also, Nikhil’s previous film, Arjun Suravaram was a big hit at the box office. Everyone involved with the project have great judgemental skills and that is building more buzz to the film.

Sukumar is known for developing unique subjects tht attract all sections of the audience. His combination with Palnati Surya Pratap has proven to be a successful one as Kumari 21F was a big hit. They will be joining hands again now. This film is touted to be a youthful entertainer in which the male lead loves the female lead in a very genuine manner and without any second thoughts. The title of the film itself has gotten the attention of many.

GA 2 Pictures and Sukumar Writings
Allu Aravind presents
Music: Gopi Sunder
Camera: Yuvaraj
Arts: Ramana Vanka
Line producer: Babu
Executive producer: Sravan Raparthi, Ashok B
Production controller: Y Veerababu
PRO: Eluru Sreenu
Co-director: Radha Gopal
Producer: Bunny Vas
Director: Palnati Surya Pratap
Story, screenplay: Sukumar

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close