MOVIE NEWSSpecial Bites

గెటప్ శ్రీను,  ప్రశాంత్ రెడ్డి, కృష్ణమాచారి, సాయి వరుణవి క్రియేషన్స్ ‘రాజు యాదవ్’ టీజర్ విడుదల

Getup Srinu, Prashanth Reddy, Krishnamachari, Sai Varunavi Creations 'Raju Yadav' Teaser Released

సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై గెటప్ శ్రీను  కథానాయకుడిగా రూపొందిన చిత్ర “రాజుయాదవ్ “. సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తునన్నారు. కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న రాజు యాదవ్ టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ లో లవ్ కామెడీ తో పాటు మంచి ఎమోషన్స్ తో ఆసక్తికరంగా వుంది. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను తనలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో గెటప్ శ్రీను నటన అవుట్ స్టాండింగ్ గా వుంది.

ఏం జరిగినా.. లైఫ్ లాంగ్ స్మైల్ ఫేస్ తో గడపాల్సి వస్తే ఎలా వుంటుంది అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఎక్సయిటింగా వుంది. హీరోయిన్ అకింత ఖరత్ స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకుంది. సాయి రామ్ ఉదయ్ విజువల్స్ బ్రిలియంట్ గా వున్నాయి. టీజర్ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించిన నేపధ్య సంగీతం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. టీజర్  ‘రాజు యాదవ్’ పై క్యూరీయాసిటీని పెంచింది.

ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడంలో భాగమైన ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ ఈ చిత్రంలో రెండూ పాటలు రాయడం, అలాగే రాహుల్ సింప్లీగంజ్  ఓ పాట పాడటం మరో ప్రధాన ఆకర్షణ. మరో రెండు పాటలకు కాసర్ల శ్యాం సాహిత్యం అందిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చిలో ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :
గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద్ చక్రపాణి, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం : కృష్ణమాచారి.కె
నిర్మాత: ప్రశాంత్ రెడ్డి
సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్
ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి బొంతల
డివోపీ: సాయి రామ్ ఉదయ్
లిరిక్స్ :చంద్ర బోస్, కాసర్ల శ్యామ్
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిర్యాల, చంద్రబోస్, యశస్వి
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీ నాగేంద్ర తంగెళ
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విప్లవ  
పీఆర్వో : వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close