
Sisters, mothers, daughters will relate to my character in ‘KalyanamKamaneeyam’: Priya Bhavani Shankar
Sisters, mothers, daughters will relate to my character in 'KalyanamKamaneeyam': Priya Bhavani Shankar

‘Kalyanam Kamaneeyam’ is this Sankranthi’s feel-good and warm family
drama involving a young married couple. UV Creations has produced the
movie. Young hero Santosh Shoban is its male lead.
Priya Bhavani Shankar, one of the most talented actors in contemporary
Tamil cinema, is making her Tollywood debut with this film. She is
excited as much as she is anxious about the film’s release tomorrow
(January 14). In this interview, the ‘Thiru’ actor talks about the
film and gives us an idea of what to expect from it.
Here is what Priya said:
I have done some really good content films in Tamil. I am happy to be
making my debut in Telugu, that too with a film produced by a big
banner like UV Creations.
I am a fan of feel-good films that exude warmth and have relatable
characters. ‘Kalyanam Kamaneeyam’ is the film I would love to watch.
So, doing it was a great experience. All the more so because of the
wonderful team I got to work with.
Right from the hero down, everyone was so sorted and cooperative.
Santosh Shoban helped me with my lines, as I am against using
prompting on set. He is a talented actor who I came to know had worked
his way up through sheer dint and struggle. Although he is the son of
a filmmaker (director Shoban of ‘Varsham’ fame), he is no privileged
kid.
Coming to the plot, it is a simple yet evocative one revolving around
a husband and a wife who have zero ego issues. The husband is
unemployed and his working wife, Shruti (played by me), is upset when
she discovers that her social circle views him as worthless. One bad
day, she picks up an argument with him. This triggers a series of
happenings in her married life.
I am much like Shruti in real life. I can say she is 90% the real me.
As such, I didn’t find playing her challenging at all. Moreover, this
is a feel-good film that is my kind of cinema. I am eagerly waiting to
know I will be viewed by the Telugu audience. When I made my debut in
Tamil, my expectations were muted. Ahead of my Tollywood debut, I am
anxiously waiting to gauge the audience’s response.
Director Anil Kumar Aalla has written and narrated the story in a
completely relatable fashion. Shruti is someone your sister, your
wife, your daughter, and your mother will relate to. She is a woman
you have all met in real life. Anil is not my first debut director. I
have worked with quite a few debutants in Tamil. I am game for it,
especially when the filmmaker comes with clarity of thought. UV
Creations supporting him only enhanced my trust in him.
Shravan Bharadwaj’s music is going to be enjoyed by the audience. The
production values are rich.
I am going to be seen in Naga Chaitanya’s ‘Dhootha’ this year. Then
there is Satyadev’s 26th film. I am also in talks for some Telugu
projects.
చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ “కళ్యాణం కమనీయం” శృతి పాత్రలో తమని
తాము చూసుకుంటారు: ప్రియ భవాని శంకర్
“కళ్యాణం కమనీయం” సంక్రాంతికి విడుదలయ్యే కుటుంబ కథా చిత్రం. కొత్తగా
పెళ్లయిన ఇద్దరి జంట మధ్య సాగే ఈ న్యూ-ఏజ్ ఫామిలీ డ్రామాలో సంతోష్ శోభన్
హీరోగా నటించగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
యువి కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రంతో అనిల్ కుమార్ ఆళ్ళ ని దర్శకుడిగా
పరిచయం చేశారు.
తన తొలి తెలుగు సినిమా సంక్రాంతి కి రిలీజ్ ఉండడంతో మీడియాతో మాట్లాడారు
ప్రియా భవాని శంకర్…
“తమిళ్ లో నేను చాలా మంచి చిత్రాలు చేసాను. యువి లాంటి పెద్ద బ్యానర్ తో
తెలుగు లో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజ జీవితానికి దగ్గరగా
హృద్యంగా ఉండే చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి కథతో
తెరకెక్కిన “కళ్యాణం కమనీయం”లో ఒక ముఖ్యమైన భాగమయినందుకు, ఒక మంచి టీమ్
తో పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
ప్రతి ఒక్కరు నాకు చాలా సహాయంగా ఉన్నారు. నాకు సెట్స్ లో ప్రామ్ప్టింగ్
నచ్చదు, సంతోష్ శోభన్ నాకు డైలాగ్స్ లో సహాయం చేసారు. సంతోష్ అద్భుతమైన
నటుడు. పేరొందిన దర్శకులు శోభన్ గారి కొడుకు అయినా కూడా తను ఒక్కొక్క
మెట్టు ఎక్కుతూ కస్టపడి ఎదిగాడు.
ఇగో సమస్యలు లేని ఒక భార్య భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన
సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ,
ఉద్యోగానికెళ్ళే భార్య శృతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు,
అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం.
శృతి పాత్రకి నాకు దాదాపు 90 % పోలికలున్నాయి. అలా ఆ పాత్ర పోషించడంలో
నాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. తమిళ్ లో నా మొదటి చిత్రానికి
నాకు పెద్దగా ఆలోచన లేమి లేవు. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా
ఆదరిస్తారో అనే ఆందోళన ఇప్పుడుంది.
ఎవరిని వాళ్ళు ఆ పరిస్థితుల్లో పోల్చుకునేలా కథ, మాటలు, పాత్రలు రాసారు
అనిల్ కుమార్ ఆళ్ళ. శృతి పాత్రలో మీ చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ
తమని తాము చూసుకుంటారు. అనిల్ లాంటి చాల మంది కొత్త దర్శకులతో నేను పని
చేసాను. దర్శకుడికి కథ పై పూర్తి పట్టుండాలి అనుకుంటాను నేను. యువి లాంటి
పెద్ద సంస్థ ఈ కథ నిర్మాణానికి సిద్దమైనపుడు నాకు అనిల్ మీద పూర్తి
నమ్మకం వచ్చింది.
శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం అందించడంతో పాటలు ప్రేక్షకులకి
విపరీతంగా నచ్చేసాయి. నిర్మాణ విలువల్లో కూడా యువి ఎక్కడా తగ్గలేదు.
ఈ సంవత్సరంలో నాగ చైతన్య తో ‘దూత’, సత్యదేవ్ 26 వ చిత్రంలో
నటించనున్నాను, అలాగే కొత్త కథలు కూడా వింటున్నాను అంటూ ముగించారు.