
ప్రముఖ జర్నలిస్టు, ఆంద్రప్రభ మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దనరెడ్డి మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిజానికి వెన్నెముక లాంటి వారన్నారు. ఆయన మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. తెలుగు జర్నలిజం పెద్దదిక్కును కోల్పోయిందని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
