EventEvents/PressmeetsMOVIE NEWSSpecial Bites

‘ఏటీఎం’ క్రెడిట్ అంతా దర్శకుడు చంద్ర మోహన్‌కు దక్కాలి.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్‌ శంకర్

All credit for ZEE5 Original 'ATM' must go to director Chandra Mohan: Director Harish Shankar @ Trailer Launch Event

టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్‌కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఆయ‌న త‌న రూట్‌ను మార్చారు. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి సిద్ధమ‌య్యారు. అందులో భాగంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5తో క‌లిశారు హ‌రీష్ శంక‌ర్‌. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కూడా జాయిన్ అయ్యారు. వీరిద్ద‌రూ క‌లిసి  `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, దివి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జనవరి 20న రాబోతోన్న ఈ `ఏటీఎం` ట్రైల‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో  …

దర్శకుడు చంద్ర మోహన్ మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు ఇచ్చి చేయమని చెప్పిన హరీష్‌ శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో సినిమా చేయాలని ఎంతో మంది కలలు కంటారు. నాకు ఈ ప్రాజెక్ట్‌తో అవకాశం దొరికింది. నా టీం ఎంతో సహకరించింది. మాస్ వైబ్‌ అనేది మ్యూజిక్,ఆర్ఆర్‌తో అర్థమవుతుంది. సుబ్బరాజు గారి పాత్ర, షఫీ గారి పాత్ర చాలా బాగుంటుంది. జీ5 టీంకు థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడినందుకే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. హరీష్ శంకర్ గారు మా వెనకాల ఉన్నారనే ధైర్యంతోనే ముందుకు వెళ్లామ’ని అన్నారు.

నిర్మాత హన్షిత మాట్లాడుతూ.. ‘హరీష్‌ శంకర్ గారు మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. ఆయన ఆలోచనల్లోంచే ఈ ఏటీఎం కథ పుట్టింది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నటీనటులంతా కూడా చక్కగా నటించారు. సుబ్బరాజు, సన్నీ అద్భుతంగా నటించారు. ఈ తరం ఆడియెన్స్ కోరుకునే ప్రాజెక్టులు తెరకెక్కించాలనే డీఆర్పీ (దిల్ రాజు ప్రొడక్షన్స్)ని ప్రారంభించామ’ని అన్నారు.

నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏటీఎం ప్రాజెక్ట్ హరీష్ శంకర్ అన్న వల్లే మొదలైంది. సుబ్బరాజు గారితో మాది ఎన్నో ఏళ్ల బంధం. ఈ సినిమాలో ఆయన నటించినందుకు థాంక్స్. ఏటీఎంలో నటించిన నలుగురు కుర్రాళ్లు అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

డైరెక్టర్ హరీష్‌ శంకర్ మాట్లాడుతూ.. ‘కరోనా కంటే ముందు ఈ కథను రాసుకున్నాను. కరోనాలో ఇంకా డెవలప్ చేశాను. ఓటీటీలకు రాస్తే క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. మంచి కంటెంట్‌ను జనాల ముందుకు తీసుకు రావడానికి ఫైనాన్షియల్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తరువాత నాకు అనిపించింది. ఏటీఎం సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. సినిమాను అద్భుతంగా తీశారు. బడ్జెట్ విషయంలో సహకరించిన జీ5 టీంకు థాంక్స్. హర్షిత్, హన్షితకు వెల్కమ్. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో తీయాలి. ఎస్వీసీలో డైరెక్షన్ చేయడం అనేది పెద్ద అచ్చీవ్‌వెంట్. చంద్ర మోహన్‌కు ఆ అవకాశం దక్కింది. రెమ్యూనరేషన్ విషయంలో సుబ్బరాజు సహకరించారు. నా ఫస్ట్ సినిమా షాక్‌లో సుబ్బరాజు చేశారు. ఇప్పుడు నా ఫస్ట్ ఓటీటీ సినిమాలోనూ సుబ్బరాజు నటించారు. షఫీ గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. దివి, అశ్విన చక్కగా నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి గారు మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చారు. జీ5 టీం మాకు ఎంతో సహకరించారు. మా కోసం ఎన్నో రూల్స్ బ్రేక్ చేశారు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత క్వాలిటీగా వచ్చింది. రెండో సీజన్ కూడా రాబోతోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఏటీఎంలో సన్నీ, రోయల్, రవి రాజ్, కృష్ణ నలుగురు పాత్రలు కాదు.. నాలుగు పిల్లర్స్. సన్నీకి పర్పెక్ట్ మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జనవరి 20న జీ5లో రాబోతోంద’ అని అన్నారు.

జీ 5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దేశ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘‘ఏటీెఎం’ ఓ గేమ్ చేంజ‌ర్‌. తెలుగు ఓటీటీ రంగంలో ఇది క‌చ్చితంగా గేమ్ చేంజ‌ర్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. మాకు న‌మ్మ‌కం ఉంది. 2003లో దిల్ రాజుగారు నిర్మాత‌గా దిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు 2023లో ఓటీటీలోకి ఏటీఎంతో అడుగు పెట్టారు. జ‌న‌వ‌రి 20న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. అప్పుడు దిల్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ఇప్పుడు ఓటీటీలో ఏటీఎం కూడా అదే రేంజ్‌లో హిట్ అవ‌నుంది. ఈ సిరీస్‌కు అద్భుత‌మైన క‌థ‌ను అందించిన హ‌రీష్‌గారికి, అంతే అద్భుత‌మైన క‌థ‌ను అందించిన చందుగారికి థాంక్స్‌. స‌న్నీ, కృష్ణ స‌హా మా న‌లుగురు హీరోలతో స‌హా సుబ్బ‌రాజ్‌గారు, ష‌ఫీగారు, దివిగారికి థాంక్స్‌. ప్ర‌తీ పండుగ‌కు ఇక అంద‌రూ జీ5 వైపు కంటెంట్ కోసం చూస్తారు. అంత గొప్ప కంటెంట్ రానుంది. ఈ ఏడాదిని ఏటీఎంతో ప్రారంభిస్తున్నాం. ప్ర‌తి నెల ఓ కొత్త వెబ్ సిరీస్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అడ్డ‌మైన బొమ్మ‌ల్లో సినిమాను చూడ‌కండి. జీ 5లో సబ్ స్క్రిప్ష‌న్ తీసుకోండి’’ అన్నారు.

హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘హరీష్‌ శంకర్ గారిని ఎప్పుడైనా ఆడియో లాంచ్‌లో చూసినప్పుడు పక్కన నిల్చుంటే చాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన రాసిన కథలో నేను జగన్ అనే పాత్రను పోషించాను. అలాంటి ఆయన రాసిన పాత్రకు వంద శాతం నేను ఇవ్వాలని అనుకున్నాను. లైఫ్ టైం నాకు గుర్తుండిపోయే పాత్ర. ఇది మాకు చాలా పెద్ద అవకాశం. నా ఫ్రెండ్స్ రోయల్, రవి రాజ్, కృష్ణ, దివిలకు థాంక్స్. సుబ్బరాజు అన్న పాత్ర చాలా బాగుంటుంది. హరీష్‌ అన్నకు థాంక్స్. నిర్మాత హర్షిత్, హన్షితలకు థాంక్స్. ఏటీఎం అనేది అద్భుతంగా ఉండబోతోంది. జీ5కి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్’ అని అన్నారు.

ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ.. ‘ఇలాంటి కొత్త కథలకు మ్యూజిక్ చేయాలని అందరూ అనుకుంటారు. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

దివి మాట్లాడుతూ ‘‘నేను నా యాక్టింగ్‌ను మ‌హ‌ర్షి సినిమాలో చిన్న రోల్‌తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏటీఎం సిరీస్‌లో యాక్ట్ చేశాను. చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. హ‌రీష్‌గారికి, హ‌ర్షిత్‌గారికి, చందుగారికి, నా కోస్టార్స్‌కి థాంక్స్‌’’ అన్నారు.

షఫీ మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడక్ష‌న్‌, హ‌ర్షిత్‌, హ‌న్షిత స‌హా అంద‌రికీ థాంక్స్‌. హ‌రీష్ గారు బ్యూటీఫుల్ స్క్రిప్ట్ అందించారు. చందుగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హ‌రీష్‌గారు ఇంత మంచి స్క్రిప్ట్ ఎలా రాశారో తెలియ‌దు. నా పాత్ర నాకే కొత్త‌గా అనిపిస్తుంది. లైఫ్ ఫిలాస‌ఫీని నా క్యారెక్ట‌ర్‌తో చ‌క్క‌గా చెప్పించారు. నా డైలాగ్స్ మిమ్మ‌ల్ని హంట్ చేస్తాయి. అలాంటి క్యారెక్ట‌ర్స్‌ను ఇప్పుడే చూస్తున్నాను. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు.

సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘ఈ సిరీస్‌తో న‌లుగురు జెమ్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. చంద్ర‌మోహ‌న్ క‌థ చెప్పిన‌ప్పుడు సాత్వికడ‌ని అర్థ‌మైంది. కానీ.. షూటింగ్ స‌మ‌యంలో త‌న వ‌ర్కింగ్ స్టైల్‌లో తెలిసిపోయింది. నేను కూడా పూర్తిగా సిరీస్ చూడ‌లేదు. జ‌న‌వరి 20న సిరీస్‌ను జీ 5లో చూస్తాను. హరీష్ నాకు ఫోన్ చేసి క్యారెక్ట‌ర్ చేయాల‌ని చెప్పిన‌ప్పుడు రెగ్యుల‌ర్ రోల్ అనే అనుకున్నాను. కానీ.. కానీ సెట్స్‌లోకి అడుగు పెట్టిన త‌ర్వాతే తెలిసింది. చందు నా క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా మ‌లిచాడు. చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆర్య సినిమా స‌మ‌యంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత చిన్న పిల్ల‌లు.. ఇప్పుడు వాళ్లు ప్రొడ్యూస‌ర్స్ కావ‌టం హ్యాపీ. హ‌రీష్ స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

న‌టీన‌టులు:

జగన్‌గా వీజే స‌న్ని, హెగ్డేగా సుబ్బ‌రాజ్‌, గ‌జేంద్ర‌గా పృథ్వీ, కార్తీక్‌గా కృష్ణ బూరుగుల‌, అభ‌య్‌గా ర‌విరాజ్‌, హ‌ర్ష‌గా రాయ‌ల్ శ్రీ, ర‌మ్యా నాయ‌క్‌గా దివి, సీఐ ఉమాదేవిగా దివ్యవాణి, మెంట‌ర్ పాత్ర‌లో ష‌ఫీ, నీలోఫ‌ర్‌గా హ‌ర్షిణి న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం:

ప్రొడ‌క్ష‌న్‌:  దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌, క‌థ‌, ర‌చ‌న‌:  హరీష్ శంక‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌, హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌, ద‌ర్శ‌క‌త్వం:  సి.చంద్ర‌మోహ‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అకుల్ ఎన్‌, సి.ఇ.ఒ:  మెహ‌ర్ కిలారు, కో డైరెక్ట‌ర్‌:  కృష్ణ శంక‌ర్ చింత‌, స్క్రీన్ ప్లే:  సి.చంద్ర‌మోహ‌న్‌, మ్యూజిక్‌:  ప్ర‌శాంత్ ఆర్‌.విహారి, క్రియేట‌ర్‌:  హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌, ఎడిట‌ర్‌: అశ్విన్‌.ఎస్‌, సినిమాటోగ్ర‌ఫీ:  మౌనిక్ కుమార్‌.జి, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  శ్రీనివాస్ పూర్ణ‌, పి.ఆర్.ఒ:  బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర – ఫణి).

———————————————————

All credit for ZEE5 Original ‘ATM’ must go to director Chandra Mohan: Director Harish Shankar @ Trailer Launch Event

This Harish Shankar-written Original to stream from January 20

Star director Hari Shankar has evolved a unique style on the feature film front in the past many years. He has now been making creative attempts to encourage new, untapped talents. As part of the endeavour, he joined hands with the streaming giant ZEE5. And star Tollywood producer Dil Raju has joined him in this! The duo has made a web series titled ‘ATM’ for ZEE5 with Bigg Boss Telugu fame VJ Sunny in the lead. Krishna, Raviraj, Roiel Shree and Divi are also playing lead roles in it. The show has been directed by Chandra Mohan. Its pre-release event was held today.

Speaking on the occasion, Chandra Mohan thanked Harish Shankar for entrusting the responsibility of directing the show to him. He added that it’s the dream of everyone to work under producer Dil Raju. “I feel fortunate to have got to wield the megaphone for ‘ATM’. I got to work with a talented team. ‘ATM’ has got mass vibes. You can feel it through the RR. The characters played by Subburaju and Shafi are going to be engrossing. I thank the ZEE5 team. Harish Shankar garu stood by me throughout and his support kept me going,” Chandra Mohan added.

Producer Hanshitha said that Harish Shankar is like a family member. “It is from his thoughts that ‘ATM’ took birth. And the director did a great job at execution. The actors have portrayed their best. Subburaju garu and Sunny have done a great job. We have launched Dil Raju Productions to make content that today’s generation wants,” she added.

Producer Harshit Reddy said that ‘ATM’ happened only because of Harish Shankar. He also said that he has known Subburaju for many years. “I thank him for acting in ‘ATM’. All four lead men have done so nicely. I thank everyone who has been a part of the series,” he added.

Harish Shankar, ATM’s showrunner, said that the story was written before the pandemic and that it was further developed during the lockdown. He added that the OTT route was chosen because it offers creative liberty. “All credit for this show goes to director Chandra Mohan, who bagged the rare opportunity to make a film under Dil Raju Production and SVC. I thank Team ZEE5 for cooperating with us on budget issues. I welcome Hanshitha and Harshit. They must bring out more and more content. Subburaju supported us on the fee front. Incidentally, he acted in my first feature film ‘Shock’ and also in my OTT debut. Divi, Shafi, Ashwin and others have acted so well. ZEE5 willingly broke rules for us. Prashanth R Vihari’s music and RR are so good. The second season of ‘ATM’ is going to be set in the backdrop of Dubai. Sunny, Krishna, Raviraj, Roiel Shree are like four pillars of ‘ATM’. Sunny has the potential to become a mass hero. ‘ATM’ will start streaming on January 20,” he added.

SaiTeja Desharaj, Vice President of Content Zee5 (Telugu), said, “‘ATM’ is surely going to be a game-changer in the Telugu OTT space. It was in 2003 that Dil Raju garu made a debut as a film producer with ‘Dil’. Twenty years later, he is debuting on OTT with ‘ATM’. This January 20, you will know that ‘ATM’ is going to be as big a hit as ‘Dil’.” Desharaj added that Harish Shankar’s story, Chandra Mohan’s direction, and the performances of the important cast members are going to be major highlights. “Starting this year, ZEE5 is going to bring out strong content for every major festival. We are making a start with ‘ATM’. Every month, we are going to come out with interesting content and web series. Please watch ZEE5 content by subscribing to our OTT,” he added.

VJ Sunny said that he had a dream of meeting Harish Shankar just once and getting a photograph clicked with him. He is elated that he has now acted in a lead role in a story written by the director. “This is a life-time memory and character. It’s a huge opportunity for us,” Sunny said, also lauding his co-stars. He thanked the producers, director and ZEE5 on the occasion.

Prashanth R Vihari said, “Everyone likes to compose music for good content like this. I thank the makers for the opportunity.”

Divi said that she started out her acting endeavour by playing a small role in ‘Maharshi’. “Acting in ‘ATM’ makes me proud,” she said, thanking the producers and director.

Shafi said that ‘ATM’ is a beautiful script. “Harish Shankar garu wrote an amazing script and my character is a total surprise. My character and its life philosophy are going to impress the viewer. My character’s dialogues are going to haunt you.”

Subbaraju said, “Four very talented actors are getting introduced through ‘ATM’. Chandra Mohan’s narration left me to believe that he is a soft person. Working under him made me realize his style. When Harish Shankar offered me the role, I assumed that my character would be a regular one. But once I was on set, I tasted the director’s treatment. I am very excited. Harshit and Hanshitha were kids when ‘Arya’ was made. I am very happy that they have now turned into producers.”

Cast:

Sunny as Jagan
Krishna as Karthik
Raviraj as Abhay
Roiel Shree as Harsha
Subbaraju as Hegde
Prudhvi as Gajendra
Divya Vani as CI Umadevi
Divi as Ramya Nayak
Harshini as Niloufer
Ramakrishna as Seth
Shafi as Mentor
Dayanandh Reddy as Yesu Babu
Rohini Naidu as Gulabi

Crew:

Story writer, Creator, Showrunner: Harish Shankar
Screenplay, Direction: C Chandra Mohan
Additional Screenplay: Phani
Dialogue: Vijay Muthyam, CP Emmanuel
Cinematography: Monic Kumar G
Music: Prashanth R Vihari
Editing: Ashwin S
Art: Srinivas Punna
Costumes: Srinivas
Co-Direction: Krishna Shankar Chinta
Executive Producer: Akul N
Casting: Puhpa Bhaskar
Production: Harshith Reddy, Hanshitha on Dil Raju Productions
CEO: Meher Kilaru

Tags

Related Articles

Back to top button
Close
Close