Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల రెడ్‌ కార్పెట్‌లో క్లాసిక్‌ బ్లాక్‌ టుక్సెడోతో తారక్‌ లుక్‌ అదుర్స్

NTR Jr owns the red carpet at Golden Globe in a classic black tuxedo

NTR at Golden Globes Awards

మాన్‌ ఆఫ్‌ మాసస్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద గ్లోబ్‌ అవుతున్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేదిక రెడ్‌ కార్పెట్‌ మీద ఎన్టీఆర్‌ ఎంట్రీకి ఫిదా అవుతున్నారు ఇంటర్నేషనల్‌ జనాలు. నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డుల్లో బెస్ట్ఒరిజినల్‌ సాంగ్‌ పురస్కారం దక్కింది. రాల్ఫ్‌ లారెన్‌ బ్లాక్‌ టుక్సెడోలో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు తారక్‌.

 గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్ ఫిల్మ్ ఇన్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజెస్‌లో నామినేట్‌ అయింది ట్రిపుల్‌ ఆర్‌ సినిమా.

ట్రిపుల్‌ ఆర్‌కి అంతర్జాతీయ వేదిక మీద అందుతున్న అద్భుతమైన స్పందన గురించి రెడ్‌ కార్పెట్‌ మీద ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ”రాజమౌళిగారితో పనిచేయడం వల్ల, ఆయన ట్రాక్‌ రికార్డును దృష్టిలో పెట్టుకోవడం వల్ల గమనిస్తే, తప్పకుండా మేం గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది. కానీ ఇప్పుడు మేం చూస్తున్నది కేవలం గెలుపు మాత్రమే కాదు. అంతకు మించిన విజయం.. మొన్నామధ్య జపాన్‌లోనూ, ఇప్పుడు అమెరికాలోనూ…” అని అన్నారు.
రెడ్‌ కార్పెట్‌ మీద మార్వెల్‌ గురించి మాట్లాడుతూ ”మార్వెల్‌ సినిమా చేయాలని ఉంది. నా ఫ్యాన్స్ దీని గురించి ఇప్పటికే  క్రేజీగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్‌మ్యాన్‌ అంటే ఇష్టం. తను మాకు చాలా దగ్గరగా అనిపిస్తాడు. అతనికి సూపర్‌పవర్లు ఏమీ ఉండవు. ఇతర గ్రహాల నుంచి అతనేమీ రాడు. ఏదో వైజ్ఞానిక ఎక్స్ పెరిమెంట్స్ వల్ల పుట్టిన కేరక్టర్‌ కాదు” అని అన్నారు.

ట్రిపుల్‌ ఆర్‌లో కొమరం భీమ్‌ నుంచి ఇతర సినిమాల్లో ఆయన నటించిన పాత్రల దాకా పలుసార్లు తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు తారక్‌. విశ్వవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయా పాత్రల గురించి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటారు.

ఎన్టీఆర్‌ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30ని మొదలుపెడతారు. జనతాగ్యారేజ్‌తో బంపర్‌ హిట్‌ కొట్టిన ఈ కాంబోలో రాబోయే సినిమా కోసం జనాలు కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా 2024 ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్‌ 31ని ప్రశాంత్‌ నీల్‌ డైరక్ట్ చేస్తారు. ఆల్రెడీ వచ్చిన అనౌన్స్ మెంట్‌‌ పోస్టర్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది.

&&&&&&&&&&&&

NTR Jr owns the red carpet at Golden Globe in a classic black tuxedo

Man of masses NTR Jr made a stunning entry on the red carpet of the Golden Globes where the film RRR won the award for Best Song for Naatu Naatu. NTR Jr. walked the red carpet in a classic black tuxedo by Ralph Lauren.  

RRR was nominated in two categories at the Golden Globes including Best Song & Best Film in Non- English Language.

Talking about the RRR phenomenon going international NTR Jr on the red carpet said, “Working with Rajamouli, taking his track record into consideration we definitely thought we have a winner. But this one is something more than a winner first in Japan and today in America.”

While on the red carpet, the actor also spoke about manifesting to work in a Marvel movie, “ I would love to do this film, my fans are already going crazy with this idea. I love Iron Man he is so relatable, he is someone like us. He does not have superpowers. He doesn’t come from a different planet. He’s not someone who has been put through a science experiment.”

The actor has proved at multiple occasions that he has what it takes to play a superhero on screen right from his portrayal of Komaram Bheem to all the other characters NTR Jr has played till date.

NTR Jr will soon begin shooting for his next  NTR30 which will be directed by Koratala Siva of Janatha Garage. The film is scheduled to release on 5th April 2024. He also has NTR31 on the cards which will be directed by KGF director Prashanth Neel.

Tags

Related Articles

Back to top button
Close
Close