EventEvents/PressmeetsMOVIE NEWSNEWSSpecial Bites

రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న నందమూరి తారకరత్న, నారా లోకేష్ ల బేటీ..?

The daughter of Nandamuri Tarakaratna and Nara Lokesh, who are interested in political circles..?

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్, నందమూరి తారకరత్న ఈ రోజు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.
సాధారణంగా అయితే వీరిద్దరి భేటీ చర్చనీయాంశం కాదు. ఇద్దరు బంధువులు, బావ బామ్మర్దులు కాబట్టి మీటింగ్ కావడం కామన్. కానీ, ఇటీవల తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందని తారక రత్న వెల్లడించడంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ ను తారకరత్న కలవడం వలన రాజకీయ పరంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు జరిగిన బేటీ తో రాబోయే ఎన్నికల్లో తారక రత్న ఎమ్మెల్యే టికెట్ విషయమూ చర్చకు వచ్చిందని కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేయడానికి సిద్దపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తారకరత్న . ఎక్కడ నుంచి పోటీ చేసేదీ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబ సంపూర్ణ మద్దతు తెలుగు దేశానికి ఉంటుందని, ఇటీవల నందమూరి – నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొందరు చేసే వ్యాఖ్యలకు ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం లేదని తారకరత్న చెప్పినట్లు తెలిసింది. అయితే గతంలో కూడా నందమూరి తారకరత్న తెలుగుదేశం పార్టీ కొరకు పలు జిల్లాలు తిరిగాడు.దానికి ఎంతో మంచి పేరు వచ్చింది.మరి ఈ సారి పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతాడో చూడాలి

Tags

Related Articles

Back to top button
Close
Close