MOVIE NEWSSpecial Bites

ఎలాంటి మార్పు లేకుండా జనవరి 14నే “కళ్యాణం కమనీయం” విడుదల – దర్శకుడుఅనిల్ కుమార్ ఆళ్ల

As scheduled, Kalyanam Kamaneeyam will release on January 14th - Director Anil Kumar Aalla

సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”.
ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. సకుటుంబంగా చూసే
ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల
14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర
విశేషాలు తెలిపారు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల.

– నేను పుట్టి పెరిగింది గుంటూరులో. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి
ఉండేది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాను.
వారాహి సంస్థలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. ఈ లైన్ అనుకున్న తర్వాత
నా స్నేహితుడు అజయ్ కుమార్ రాజు ద్వారా యూవీ క్రియేషన్స్ లో పరిచయం
ఏర్పడింది. అలా ఈ సినిమాకు అవకాశం దక్కింది.

– పెళ్లయ్యాక భర్తకు జాబ్ లేకుంటే భార్య ఎలాంటి పరిస్థితులు
ఎదుర్కొంటుంది అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. అయితే అదొక్కటే కాదు
ట్రైలర్ లో రివీల్ చేయని చాలా అంశాలు సినిమాలో ఉంటాయి. “కళ్యాణం కమనీయం”
అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.  సకుటుంబంగా చూసేలా సినిమా
చేసినందుకు సంతోషంగా ఉన్నాం.

– ఇందులో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువ జంటగా సంతోష్
శోభన్, ప్రియ భవానీ శంకర్ నటించారు. శివ శృతి పాత్రల్లో వారి నటన
మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరికీ యాప్ట్ క్యారెక్టర్ ఇవి. శృతి
పాత్రలో ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ప్రియ భవానీ శంకర్ ను
తీసుకున్నాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ టీనేజ్ హీరోయిన్ బాగుండదు. కొంత
పరిణితి గల అమ్మాయిలా కనిపించాలి. శృతి క్యారెక్టర్ ను ప్రియ పర్పెక్ట్
గా పర్మార్మ్ చేసింది. తమ చుట్టూ జరిగే ఈగో గేమ్స్ ను ఈ యువ జంట ఎలా
ఎదుర్కొన్నారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

– యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా
భావిస్తున్నాను. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా
మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు
క్లీన్ యూ సర్టిఫికెట్ తీసుకోమని సజెస్ట్ చేశారు. వాళ్లకూ అంత బాగా
నచ్చింది. క్లీన్ యూ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాం.

– పెళ్లైన తర్వాత మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం కొత్తదే. అలా ఓ యువ
జంట తమ వైవాహిక జీవితం ప్రారంభమయ్యాక ఎలాంటి కొత్త పరిస్థితులు
ఎదుర్కొన్నారు. వాటి నుంచే ఏం నేర్చుకున్నారు, మళ్లీ ఆ తప్పులు చేయకుండా
ఎలా సరిదిద్దుకున్నారు అనేది అన్ని ఎమోషన్స్ తో సినిమాలో చూస్తారు. మన
సొసైటీలో అమ్మాయి ఫీలింగ్స్ ను మా కథ ప్రతిబింబిస్తుంది.

– నా దృష్టిలో సినిమా అంటే మనల్ని మనం పోల్చుకోవాలి. “కళ్యాణం కమనీయం”
అలా రిలేటబుల్ మూవీ. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా కథకు
స్ఫూర్తినిచ్చాయి. అలా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సందర్భాలు
ఎదురుకావొచ్చు.

– మా చిత్రంలోని అన్ని పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రావణ్ భరద్వాజ్
అలరించే మ్యూజిక్ ఇచ్చారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రత్యేక
ఆకర్షణ అవుతుంది. లీడ్ యాక్టర్స్ అంతా తమ పాత్రలతో మెప్పిస్తారు.

– దర్శకుడిగా నాకు ఫేవరేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎమోషన్
చూపించాలంటే మణిరత్నం, ఒక హై లోకి తీసుకెళ్లాలంటే రాజమౌళి, సొసైటీకి మంచి
చెప్పే చిత్రాల విషయంలో శంకర్, యాక్షన్ అంటే బోయపాటి ఇలా..చాలా మంది
అభిమాన దర్శకులు ఉన్నారు. నాకు రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్ జానర్
ఇష్టం. త్వరలో నా కొత్త సినిమా వివరాలు చెబుతాను.

As scheduled, Kalyanam Kamaneeyam will release on January 14th –
Director Anil Kumar Aalla

Young hero Santhosh Shoban, Priya Bhavani Shankar’s complete family
entertainer “Kalyanam Kamaneeyam” is all set to release on January
14th. Directed by debutant Anil Kumar Aalla, UV concepts has produced
this film.

Speaking on the occasion, director Anil Kumar Aalla shares interesting
insights about the film…

– I was born & brought up in Guntur. I’ve been a cinephile since
childhood. I pursued direction as my career as soon as I finished
education.  Worked in Vaarahi Production house for Tungabhadra film.
While developing this story I’ve approached UV Creations through my
friend Ajay Kumar Raju and then this happened.

– Apart from the journey of a working wife with a jobless husband
featured in Trailer there are many more interesting plays in the
movie. Indeed it’s a complete family entertainer and we’re happy to
bring it for Sankranthi.

– Santhosh Shobhan and Priya Bhavani Shankar played the roles of a
newly married couple Shiva & Sruthi. They suited very well to the
characters. We felt that Sruthi character needed a matured face and
performer and thus signed in Priya. She lived in the role. The emotion
between the couple amidst the ego games around them will be very
engaging.

– I feel very lucky to debut with a renowned production house like UV
Creations. Although Sankranthi has Top Star films, I’ve sheer
confidence in our content. Even censor panel suggested us Clean U
certificate and we’re proud to make such film

– Every situation after marriage is new to us. Likewise, how a newly
wed couple came over the difficulties through understanding and
knowing each other forms the story. It has beautiful emotions and
reflects a woman’s feelings in the society.

– I fell a movie should be relatable and Kalyanam Kamaneeyam is one
such film. Some of the instances from my life also inspired this
story. Thus it can be related to everyone’s life.

– Our music album has received tremendous response. Shravan Bharadwaj
gave extraordinary music. Karthik Ghattamaneni’s cinematography stands
out. All the actors lived in their roles.

– As a filmmaker I’ve many favourite directors. To show emotions
sensibly Maniratnam, in a high Rajamouli, for social message oriented
movies Shankar, Action movies Boyapati etc. Personally, I love Romcom
& Action genre films. I’ll announce thr details of my next projects
soon.

Tags

Related Articles

Back to top button
Close
Close