
జనవరి 11న రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయనున్న యంగ్ హీరో శివ కందుకూరి “భూతద్ధం భాస్కర్ నారాయణష టీం
Young hero Siva Kandukuri's "Bhutaddhamm Bhaskar Narayanasha Team" will announce the release date on January 11.

పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించిన చిత్రమే “భూతద్ధం భాస్కర్ నారాయణ”. డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తున్న యంగ్ హీరో శివ కందుకూరి ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపింబోతున్నాడు.రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావడం విశేషం.
ఓం నమశ్శివాయ అనే అద్భుతమనైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్టార్ట్ అయినా ఈ మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కుర్చీలో ఒక స్త్రీని కట్టివేయడం, ఆమెకు తల లేకుండా కేవలం మొండెం మాత్రమే చూపించడం ఈ సినిమాపై క్యూరియాసిటీను పెంచడమే కాకుండా ఇది ఒక వైవిధ్యమైన చిత్రం గా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రం షూటింగు పూర్తిచేసుకుని, ప్రస్తుతం ఎడిటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే డేట్ ని చిత్రం యూనిట్ లాక్ చేశారు. జనవరి 11 న విడుదల చేసే డేట్ ని తెలియజేస్తారు.
నటీనటులు:
శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్, కమల్, గురురాజ్ తదితరులు
రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: గౌతమ్ జి
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్స్: అశ్వంత్, ప్రతిభ
స్టంట్స్: అంజిబాబు
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
డిజిటల్: హౌస్ఫుల్ డిజిటల్
—
Thanks & Regards,
Eluru Sreenu
P.R.O