
‘జగమే మాయ’ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘జగమే మాయ’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
Thanks to the audience who made 'Jagame Maya' a huge success: Film unit at 'Jagame Maya' press meet

ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్ పై ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ్, హిందీ… అన్నీ భాషల ప్రేక్షకులని అలరించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
చైతన్య రావు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడాని మరో ఉదాహరణగా నిలిచింది ‘జగమే మాయ’. నిర్మాత ఉదయ్ గారికి, దర్శకుడు సునీల్ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. భవిష్యత్ లో కలసి మరిన్ని సినిమాలు చేస్తాం. తేజ ఐనంపూడి చాలా ప్రతిభ వున్న నటుడు. ధన్యా చాలా చక్కగా నటించింది. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇలానే సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తాం” అన్నారు
తేజ ఐనంపూడి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు డిసెంబర్ 15న వచ్చింది. జగమే మాయ విజయాన్ని జీవితంలో మర్చిపోలేను. అందరి నుండి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. జ్యాపి స్టూడియో నాకు ఒక హోం బ్యానర్ లాంటింది. సునీల్ చాలా మంచి విజన్ వున్న దర్శకుడు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాని మరింతగా ఆదరించాలి” అని కోరారు.
ఉదయ్ కోలా మాట్లాడుతూ.. తెలుగుతో పాటు హిందీ మలయాళం కన్నడ తమిళ్ లో విడుదల చేశాం. అన్నీ భాషల్లో టాప్ ట్రెండింగ్ లో వుంది. హాట్‌స్టార్ టీం కి కృతజ్ఞతలు. సునీల్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ అందరూ వండర్ ఫుల్ పెర్ ఫార్మ్ మెన్స్ చేశారు. వంశీ శేఖర్ గారు, హాస్ టాగ్ మీడియా ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు
సునీల్ పుప్పాల : నిర్మాత ఉదయ్ గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. శేఖర్ గారికి, మీడియాకి అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
Pro: Vamsi – Shekar