
Hyderabad | Nani: ఫ్యాన్స్‌కి హీరో నాని గిఫ్ట్ ..హైదరాబాద్‌లో అభిమానులతో ఫోటోషూట్ ..ఎక్కడంటే
Hyderabad | Nani: Hero Nani gift to fans ..photoshoot with fans in Hyderabad ..where else

Hyderabad| Nani: టాలీవుడ్ యంగ్ హీరో…నాచురల్ స్టార్ నానితో కలిసి ఫోటో దిగే అదిరిపోయే అవకాశం అభిమానులకు వచ్చింది. నాని అప్ కమింగ్ మూవీ దసరా సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా యంగ్ హీరో అభిమానులతో ఫోటోషూట్ ప్లాన్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో…నాచురల్ స్టార్ నాని(Nani)తో కలిసి ఫోటో దిగే అదిరిపోయే అవకాశం అభిమానులకు వచ్చింది. నాని అప్ కమింగ్ మూవీ దసరా( Dussehra)సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా యంగ్ హీరో అభిమానులతో ఫోటోషూట్ (Photoshoot)ప్లాన్ చేశారు. మంగళవారం ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు అంటే రెండు గంటల పాటు ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగేందుకు సమయం కేటాయించారు టాలీవుడ్ స్టార్ హీరో. ఫోటో దిగాలనుకునే అభిమానులు ముందుగానే పాసుల కోసం ఉప్పు శ్రీనివాసులు(Srinivas),ప్రదీప్ వజ్రవేల్(Pradeep Vajravel)ను సంప్రదించాలని ట్విట్టర్(Twitter)ద్వారా వెల్లడించారు.
హీరోతో ఫోటో ఛాన్స్ ..
తెలుగు సినిమా హీరోల్లో నాచురల్ స్టార్ నాని స్టైలే వేరు. సెలక్టివ్ సినిమాల్లో నాచురల్‌గా ఉండే పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. నాచురల్ స్టార్ తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే మంగళవారం అభిమానులతో ఫోటోషూట్ ప్లాన్ చేశాడు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని మహముద్ హౌస్ గార్జెన్‌లో ఈ ఫోటో షూట్‌ను నిర్వహిస్తున్నారు. తనతో ఫోటో దిగాలనుకునే వారు ముందుగా పాస్‌ల కోసం ఉప్పు శ్రీనివాసులు 8019764224 ఫోన్ నెంబర్‌కి లేదంటే ప్రదీప్ వజ్రవేల్ 798060002 ఫోన్ నెంబర్‌లకు కాల్ చేసి పాసులు పొందాలని ఎస్ వెంకటరత్నం ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.
రెండు గంటల పాటు ఫోటోషూట్..
ప్రస్తుతం హీరో నాని దసరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాచురల్ స్టార్‌కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సముద్రఖని, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
ఫ్యాన్స్‌కి నాని గిఫ్ట్
గతంలో కూడా బిగ్‌బాస్ వంటి రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన నాని ..సినిమా ప్రేక్షకులతో పాటు అందరికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత స్టార్ ఇంటర్వూలు, టాక్ షోలలో ఓపెన్‌గా తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాల్ని నిర్మిస్తున్న నాని ..అభిమానుల కోసం ఫోటోషూట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.