
ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్, కొరటాల శివ పాన్ ఇండియా మూవీ NTR 30 రెగ్యులర్ షూటింగ్.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5 2024 గ్రాండ్ రిలీజ్
NTR, Koratala Shiva pan India movie NTR 30 regular shooting from February.. Grand release on April 5 2024 worldwide

RRR వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో ఎన్టీఆర్. ఈయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 30వ సినిమా ఇది. ప్రస్తుతం NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
న్యూ ఇయర్ రోజున NTR 30 నుంచి ఇటు ఫ్యాన్స్‌కి, అటు ఆడియెన్స్‌కి కిక్ ఇచ్చేలా దర్శక నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 5, 2024లో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌ను గమనిస్తే.. అందులో కత్తులు పట్టుకున్న తారక్ చేతులు మాత్రం కనిపిస్తున్నాయి. ‘వెన్ కరేజ్ టర్న్స్ ఏ డిసీజ్.. ఫియర్ ఈజ్ ది ఓన్లీ క్యూర్’ అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్ ఉంది.
పాన్ ఇండియా మూవీగా NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రాకి సంగీత సారథ్యం వహించనున్నారు.