MOVIE NEWSMovie ReviewsREVIEWSSpecial Bites

Nuvve Naa Pranam Movie Review / నువ్వే నా ప్రాణం

Nuvve Naa Pranam Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022

NewTeluguReels.com రేటింగ్ : 3/5

నటీనటులు: కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే, సుమన్‌, భానుచందర్‌ త‌దిత‌రులు.

దర్శకుడు : శ్రీకృష్ణ మలిశెట్టి

నిర్మాత: శేషుదేవరావ్‌ మలిశెట్టి

సంగీత దర్శకులు: మణి జెన్నా

సినిమాటోగ్రఫీ: ఎన్ వెంకట్ రెడ్డి

ఎడిటర్: ఎన్ వెంకట్ రెడ్డి

సంబంధిత లింక్స్ట్రైలర్

వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

కిరణ్‌ రాజ్‌ (సంజీవ్ కుమార్) ఐపీఎస్ ఆఫీసర్. డాక్టర్ ప్రియాహెగ్డే (కిరణ్మయి)ను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం ప్రియాహెగ్డే చుట్టూ తిరుగుతాడు. మొదట అతని పై ఆసక్తి చూపించకపోయినా చివరకు కిరణ్‌రాజ్‌ ఎవరో తెలిశాక, అతని పై ప్రేమను పెంచుకుంటుంది ప్రియాహెగ్డే. ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటి అవుతారు. అనంతరం వీరిద్దరి మధ్య జరిగిన నాటకీయ సంఘటనలు ఏమిటి?, ఎందుకు వీరి మధ్య దూరం పెరిగింది ?, వీరి మధ్య గొడవకు అసలు కారణం ఏమిటి?, చివరకు కిరణ్‌రాజ్‌ – ప్రియాహెగ్డే ఎలా కలిసిపోయారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రధాన పాత్రల అయిన కిరణ్‌రాజ్‌ – ప్రియాహెగ్డే పాత్రలు.. ఆ పాత్రలకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రలతో ముడి పడిన సుమన్‌, భానుచందర్‌ పాత్రలు.. మరియు ప్రధాన పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘నువ్వే నా ప్రాణం’ సినిమాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, మరియు ప్రియాహెగ్డే గ్లామర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ రాజ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన ప్రియాహెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె హావభావాలు కూడా బాగానే అలరించాయి. మెయిన్ గా ఆమె గ్లామర్ అండ్ సాంగ్స్ లో ఆమె అందచందాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పాత్ర తనను తానే బ్యాడ్ చేసుకోవడం, అలాగే ప్రేమ కోసం హీరో హీరోయిన్లు ఒకరికి ఒకరు బాసటగా నిలవడం బాగుంది. ఈ లవ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి బాగానే తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే కంటెంట్ తో బాగా ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్:

ప్రేమ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ట్రీట్మెంట్ సాగలేదు. దీనికితోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్ గా సాగాయి. అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది.

పైగా విలన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. అలాగే విలన్ ట్రాక్ విషయంలో హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన గ్రాఫ్ కూడా బాగాలేదు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

నిజానికి సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నా.. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ ఎమోషన్ ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు.

సాంకేతిక విభాగం:

సాంకేతిక విభాగానికి వస్తే.. సినిమాలో సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సాంగ్ బాగుంది. అలాగే ఆ పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, సినిమాలోని నిర్మాత శేషుదేవరావ్‌ మలిశెట్టి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు:

‘నువ్వే నా ప్రాణం’ అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో కొన్ని లవ్ సీన్స్, కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథనం స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ లో లాజిక్స్ మిస్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలు ఎక్కువ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా లవర్స్ ను ఆకట్టుకుంటుంది.

NewTeluguReels.com Rating: 3/5

Tags

Related Articles

Back to top button
Close
Close