MOVIE NEWSMovie ReviewsREVIEWSSpecial Bites

ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’ .రివ్యూ & రేటింగ్.!

Aadi Saikumar 'Top Gear' .Review & Rating.!

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంటాడు ఆది సాయి కుమార్. ఈ సంవత్సరం 5 సినిమాలు రిలీజ్ చేసాడు. అవి అంతగా ఆడలేదు. ఇక ఈ ఏడాదికి ఫైనల్ గా టాప్ గేర్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 

ఒక్క హిట్ తన ఖాతాలో పడకపోయినా వరసపెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు ఆది సాయికుమార్. అతని సినిమాలు ఎంత త్వరగా వస్తాయో..అంత త్వరాగానూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దాంతో ఆయన సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. ఏదైనా అదిరిపోయే సినిమా వస్తేనే జనాలు …ఆది సినిమా వైపు చూస్తారు. అలాంటి సినిమా తన కెరీర్ లో ఎప్పటికైనా పడకపోతుందా అని గేర్ మారుస్తూ జర్నీ కొనసాగిస్తూ ఈ సారి టాప్ గేర్ వేసాను చూడండి…అని మన ముందుకు వచ్చారు. నిజంగా టైటిల్ కి తగ్గ స్దాయిలో వర్కవుట్ అయ్యే కథనా…లేక ఈ సినిమా కూడా ఆది రెగ్యులర్ రొటీన్ ప్లాఫ్ ల లిస్ట్ లో కలిసిపోయేదా ..రివ్యూలో చూద్దాం.

కథాంశం

క్యాబ్ డైవర్ అర్జున్ (ఆది సాయికుమార్) కి కొత్త గా పెళ్లై భార్య ఆద్య (రియా సుమన్)తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు.   ఓ రోజు క్యాబ్  డ్యూటీ అవ్వకొట్టుకుని ఇంటికి బయిలుదేరుతూంటే ఓ బేరం తగులుతుంది. అప్పుడు…ఎక్కిన కష్టమర్స్ బ్రహ్మాజీ, రాజేష్ ల నుంచి సమస్య మొదలవుతుంది.   వాళ్లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్,  డ్రగ్ డీలర్   సిద్ధార్థ్ (మైమ్ గోపి) తో లింక్ అప్ అయ్యి ఉంటారు. అప్పటికే సిద్దార్ద్ వందల కోట్ల విలువైన డ్రగ్స్‌తో  సింగపూర్ వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు.అందుకోసం హైదరాబాద్ వస్తాడు. అనుకోకుండా అర్జున్ …ఆ డ్రగ్ రాకెట్ లో చిక్కుకుంటాడు. సిద్దార్ద్ కు చెందిన డ్రగ్ బ్యాగ్ మిస్ అవుతుంది. అది అర్జున్ దగ్గర ఉందని .. దాన్ని తిరిగి ఇవ్వకపోతే అతని భార్య  ఆద్యను చంపేస్తానని అర్జున్‌ను కసిద్దార్ద్ బెదిరిస్తాడు. తన భార్య ఆధ్య(రియా సుమన్) ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. ఈ కథ  చివరికి ఏం అయింది? అర్జున్ తన భార్యను కాపాడుకున్నాడా?  ఈ డ్రగ్స్ కేసు ఎలా ముగుస్తుంది? అర్జున్ ఈ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ

ఓ సాధారణమైన కాబ్ డ్రైవర్ ..అసాధారమైన సిట్యువేషన్ లో ఇరుక్కుని ..ఎలా బయిటపడ్డాడనేదే ఈ చిత్రం కథ. ఓ రాత్రిలో జరిగే కథ. స్టోరీ లైన్ గా చెప్పుకోవటానికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సరిగ్గా చేస్తే ఆ మధ్య కార్తి హీరోగా వచ్చిన ఖైదీ స్దాయిలో వర్కవుట్ కావాల్సింది. కానీ ఈ సినిమా లో  ఆస్దాయి ఎమోషన్స్ లేవు. కానీ ఉన్నంతలో ఆసక్తిగానే సాగింది. హీరో ఎలా ఆ సమస్య నుంచి తప్పించుకుంటాడు అనేది చివరి దాకా మనని కూర్చోబెడుతుంది. కాకపోతే కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. రాత్రి పూట ఛేజ్ సీన్స్ తీయటం కష్టమే కానీ డైరక్టర్ ఆ విషయంలో మంచి టెక్నికల గా ప్రెజెంట్ చేసారు. పోలీస్ లు మరీ ఓ క్యాబ్ ని కూడా ట్రేస్ చేయలేరా అనే సందేహం వస్తుంది. ఆ డౌట్ వచ్చిన దగ్గర నుంచి కథపై ఆసక్తి తగ్గుతుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది.క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది. సెకండాఫ్‌లో హైవే మీద జరిగే ఛేజ్   ల్యాగ్ అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే బాగుంది కానీ కథ రొటీన్ గానే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో డిటైలింగ్ బాగుంది. థ్రిల్లర్ గా చాలావరకూ సక్సెస్ అయ్యారు.  ఏదైమైనా   “టాప్ గేర్” టైటిల్ కు తగ్గ స్దాయిలో థ్రిల్స్ ఉండవు..  డీసెంట్ థ్రిల్స్ ని అందిస్తుందని చెప్పొచ్చు. 

టెక్నికల్ గా..

హర్ష వర్ధన్ మ్యూజిక్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఇలాంటి కథలకు అవసరమైన షార్ప్ సినిమాటోగ్రఫీ ఉంది.  డైలాగ్స్, ఎడిటింగ్ ఛల్తాహై అన్నట్లు సాగుతాయి.  కొత్త డైరక్టర్ ..శశికాంత్ మంచి సబ్జెక్టు ఎంచుకుంటే మంచి సక్సెస్ ని ఇవ్వగలుగుతారు.   రొటీన్ స్టోరీ లైన్ ని.. ఇంట్రెస్టింగ్ నరేషన్ తో మెప్పించే ప్రయత్నం చేసారు.  అయితే క్లైమాక్స్ ఇంకాస్త బాగుంటే  బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్  బాగున్నాయి. 

నటీనటుల్లో …ఆది సాయికుమార్ కి ఇలాంటి క్యారక్టర్స్  చేయటం కొత్తేమీ కాదు. అయితే కథ మాత్రం అతనికి తగ్గదే. రొటీన్ గా చేసుకుంటూ పోయాడనిపించింది. హీరోయిన్ రియా సుమన్ కు పెద్దగా సీన్స్ లేవు. విలన్ గా మైమ్ గోపి బాగా చేసారు.

ఫైనల్ థాట్
టాప్ గేర్ వెయ్యాలనుకున్నప్పుడు బ్రేక్ లు, స్పీడ్ బ్రేకర్స్   విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

రేటింగ్ : 2.5


నటీనటులు : ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ గోపి, శత్రు, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు
కథ, మాటలు, దర్శకత్వం : ఎన్.శశికాంత్
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్
నిర్మాత : కె.శ్రీధర్ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్ 30, 2022

Tags

Related Articles

Back to top button
Close
Close