MOVIE NEWSSpecial Bites

‘లక్కీ లక్ష్మణ్’ కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌… ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు :  హీరో ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. 

* హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్..

– వ‌ర్క్ ప‌రంగా చాలా  ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ప‌ర్స‌న‌ల్‌గా చూస్తే రెస్ట్ ఉండ‌టం లేదు. ఇక్క‌డ రెండు విష‌యాలున్నాయి. కామ‌న్ మ్యాన్‌గా ఉన్నప్పుడు ప‌రిస్థితులు ఒక‌లా ఉంటాయి. అదే బిగ్‌బాస్‌, సినిమానో ఎదో ఒక చిన్న‌దో, పెద్ద‌తో సెల‌బ్రిటీ స్టేట‌స్ వచ్చిన‌ప్పుడు దాన్ని హ్యాండిల్ చేయ‌టం క‌ష్ట‌మైపోతుంది. ఇక ప్రొషెష‌న‌ల్‌గా చూస్తుంటే సినిమాల ప‌రంగా, కంటెంట్ ప‌రంగా పాటలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల‌వైతే చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప‌ర్స‌న‌ల్‌గా అయితే మీడియాతో ఎలా మాట్లాడాలి.. కెమెరా ముందు ఎలా ఉండాలనే విష‌యాల‌ను కాలిక్యులేట్ చేసుకోవాల్సి వ‌స్తుంది. కానీ నేను ఒరిజిన‌ల్‌గా ఉండాల‌ని అనుకుంటున్నాను. ఇక్క‌డ కూడా యాక్ట్ చేయాలంటే నా వ‌ల్ల కావ‌టం లేదు. అదొక్క‌టే నాకు మైన‌స్ అవుతుంది నాకు. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. కానీ ఇంట‌ర్వ్యూస్‌లో మాట్లాడే సంద‌ర్భంలో లోప‌ల ఒక‌టి పెట్టుకుని బ‌య‌ట ఒక‌టి మాట్లాడ‌టం నాకు రావ‌టం లేదు. 

* నెగ‌టివ్‌గా తీసుకుంటున్నారు..

– ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. 100 మందిలో 20 మంది నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కామెంట్స్ చూసుకుని డిలీట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో కొంత మంది నా ఇంట్లో వాళ్ల‌ని టార్గెట్ చేస్తున్న‌ట్లు మెసేజెస్ పెడుతున్నారు. మేము కూడా మ‌నుషుల‌మే మాకు కూడా ఎమోష‌న్స్ ఉంటాయి. నేను నా కోపాన్ని బ‌య‌ట‌కు చూపించేస్తుంటాను. ఇంట్లోని వాళ్ల‌ని కామెంట్ చేసే కామ‌న్ పీపుల్ ఎవ‌రైనా స‌రే! ఇచ్చిప‌డేసుడే. అదే విష‌యాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేశాను. కానీ దాన్ని కొంద‌రు మ‌రోలా తీసుకున్నారు. కోట్ల రూపాయ‌లు పెట్టి సినిమా తీసిన‌ప్పుడు కింద కామెంట్స్ పాజిటివ్‌గా వ‌స్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కావాల‌నే నెగిటివ్ కామెంట్ పెడితే బాగోదు. 

* ఇంట్లో వాళ్ల‌ని తిడితే ఊరుకోవాలా..

– సోష‌ల్ మీడియాలో నెగిటివిటీ ఎందుకు ఉంటుందో అర్థం కావ‌టం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఇండియా గ్లిజ్డ్స్ వెబ్ సైట్‌లో నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటల్లో నా స‌క్సెస్‌కు మా నాన్నే కార‌ణం అని పెడితే దానికి 500 వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. అదే ఇచ్చిప‌డేస్తా కొడ‌క‌ల్లారా అని అన్న మాట‌ల‌కు ల‌క్షా ఇర‌వై వేలు వ్యూస్ 700 కామెంట్స్‌, షేర్స్ వ‌చ్చాయి. చిరంజీవిగారి వాల్తేరు వీర‌య్య వీడియోల‌కు 10..20..40 వేలు వ్యూస్ ఉన్నాయి. దీనికి మాత్రం ల‌క్షా ఇర‌వై వేలున్నాయి. అస‌లు నెగిటివ్ చూడాల‌ని ఎంతగా చూస్తున్నారో అర్థం కావ‌టం లేదు. మ‌న ఇంట్లోని వాళ్ల‌ను ఎవ‌రైనా తిడితే మ‌నం ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యాను.. అలా అవ‌టం నాకు ప్రాబ్లెమ్ అవుతుంది. ఇక కెమెరా ముందు కూడా న‌టించ‌టం ప్రాక్టీస్ చేయాలి. 

* ‘మిస్ట‌ర్ ప్రెగ్నెంట్’ కోసం వెయిటింగ్‌..

– బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే నేను సెల‌క్ట్ చేసుకున్న తొలి సినిమా మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌. ఆ సినిమా ఎందుక‌నో ఆల‌స్యం అయ్యింది. దాని కోసం నేను ఏడాది పాటు వెయిట్ చేశాను. కానీ కాలేదు. ఆలస్యం కావ‌టంపై ఫీల్ అయ్యాను. మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ సినిమా రిలీజైతే మంచి పేరు వ‌స్తుంది. డిఫ‌రెంట్ మూవీగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డ్డాను. సినిమా రిలీజ్ కంటే ముందే బిజినెస్ అయిపోవాల‌నేది నిర్మాత‌ల పాయింట్‌.. ఆ సినిమా కోసం పాటు చెమ‌ట, ర‌క్తం ధార‌పోశాం క‌దా.. త్వ‌ర‌గా రిలీజ్ కావాల‌నే ఆలోచ‌న నాది. కానీ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఆ విష‌యంలో కాస్త డిప్రెష‌న్‌కి లోన‌య్యాను. 

* ‘లక్కీ లక్ష్మణ్’ సెలక్ట్ చేసుకోవటానికి కారణమదే..

– మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ త‌ర్వాత బూట్ క‌ట్ బాల్‌రాజ్ అనే సినిమా ఒప్పుకున్నాను. అది మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు కంప్లీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్. ఫ్యామిలీతో స‌హా యూత్‌కు న‌చ్చే క్యూట్ ల‌వ్ స్టోరి  చేయాల‌నిపించింది. అప్పుడే ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ఒప్పుకున్నాను. సాధార‌ణంగా మ‌న లైఫ్‌లో క‌ష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి. మ‌న చుట్టూ ఉన్న వారిలో ప‌ది మంది మాత్ర‌మే మ‌న మంచిని కోరుకుంటారు. అలాంటి రిలేష‌న్స్‌, మ‌న జీవితంలో జరిగే కొన్ని విష‌యాల‌ను కూడా ఇందులో చూపిస్తున్నాం. 

*ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా..

– ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ కంప్లీట్ క్లీన్ కామెడీ. ఎక్క‌డా వ‌ల్గారిటీ ఉండ‌దు. నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా క‌నిపిస్తాను. మ‌న ఫ్యామిలీతో చూసేట‌ప్పుడు అదే ఈ సీన్ వ‌చ్చిందేంద‌ని త‌ల తిప్పుకునేలా ఉండ‌దు. అంద‌రూ క‌లిసి సినిమా చూడొచ్చు. 

* నిజంగా నేను లక్కీ..

– బిగ్ బాస్‌లో నేను గ‌డిపిన 104 డేస్ ఒక ఎత్తు అయితే 105 రోజున చిరంజీవిగారు, నాగార్జున‌గారు ఏదైతే నా గురించి మాట్లాడి మోటివేట్ చేశారో అవి నాకు చాలా ప్ల‌స్ అయ్యాయి. అప్పుడు ఫినాలేకు వెళ్ల‌డం నిజంగా నా ల‌క్. దాని వల్ల బ‌య‌ట‌కు రాగానే అంద‌రూ చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. 

* మా నాన్నగారి సపోర్ట్ వల్లే

– మా నాన్న‌గారు నా స‌క్సెస్‌లో ఎంతో కీ రోల్ పోషించారు. మా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. హార్ట్ ఆప‌రేష‌న్‌.. ఒక‌టే కిడ్నీ. బ్రెయిన్‌లో బ్ల‌డ్ క్లాట్ ఇన్ని స‌మ‌స్య‌లు ఓ వైపు.. మ‌రో వైపు మేం ఐదుగురు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌. అంద‌రికీ క‌ష్ట‌ప‌డి పెంచాడాయ‌న‌. మా ఇంట్లో నాకు సినిమాల్లోకి వెళ‌తానంటే ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు. నాన్న‌గారు మాత్ర‌మే స‌పోర్ట్ చేశారు. నిజానికి నాన్న‌గారి ఉద్యోగం చేయ‌టానికి రెడీ అయిపోయాను. మ‌రో రెండు రోజుల్లో సంత‌కం చేయాల్సి ఉన్న స‌మ‌యంలో నాకెందుకు క‌రెక్ట్ కాద‌నిపించి సీరియ‌ల్స్ న‌టించ‌టానికి హైద‌రాబాద్ వ‌చ్చేశాను. సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ 40-50 వేలు వ‌చ్చేవి. అందులో స‌గం ఇంటికి పంపేవాడిని. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ రావ‌టంతో షూటింగ్స్ క‌ష్ట‌మ‌య్యాయి. అప్పుడు మా నాన్న‌గారు నీపై నీకు న‌మ్మ‌కం ఉందా? అనే ప్ర‌శ్న వేశారు. దానికి నేను ఉంద‌ని స‌మాధానం చెప్పారు. సరే! అయితే కంటిన్యూ చెయ్య‌మ‌ని నాన్న అన్నారు. ఏం కాదులే నేను చూసుకుంటాలే అన్నారు. ఆరోజు ఆయ‌న నన్ను టెన్ష‌న్ పెట్టుంటే నేను కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాడినేమో. కానీ ఆయ‌న స‌పోర్ట్ చేశారు. ఇప్ప‌టికీ నేను టెన్ష‌న్ ప‌డుతుంటే .. ఎందుకు టెన్ష‌న్ ప‌డుతున్నావ‌ని ధైర్యం చెబుతుంటారు. 

* ‘లక్కీ లక్ష్మణ్’ టెక్నికల్ టీమ్ గురించి..

– వంటి చేసేట‌ప్పుడు అన్నీ చ‌క్క‌గా కుదిరితేనే రుచిగా ఉంటుంది. అలాగే సినిమాలో అన్ని విభాగాలు కలిసి పని చేస్తేనే మంచి సినిమా వ‌స్తుంది. అలాంటి మంటి టీమ్ మా లక్కీ లక్ష్మ‌ణ్ సినిమాకు కుదిరింది. న‌టీన‌టుల‌తో పాటు  సినిమాటోగ్రాఫ‌ర్ అండ్రూగారైతే జెట్ స్పీడు. 28 రోజులు.. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేశాం. సినిమాను క‌ల‌ర్‌ఫుల్‌గా తీశారు. అలాగే అనూప్‌గారు మంచి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడిగారు ఎంత మంచి టెక్నీషియ‌నో అందరికీ తెలిసిందే. 

* ఆ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అలా అన్నారు..

– ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా విష‌యంలో యాక్ట‌ర్ నాతో పాటు ఇత‌ర టీమ్.. డైరెక్ట‌ర్ అభిగారు స‌హా ఇత‌ర టెక్నిక‌ల్ టీమ్ అంద‌రూ మా వంతు మంచి ప్ర‌య‌త్నాన్ని చేశాం. ఇండ‌స్ట్రీలో అంద‌రిలాగానే మంచి హిట్ కొట్టాల‌నే సినిమా తీశాం. ఇక ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఓ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్‌కి ఈ సినిమాను చూపించాను. ఆయ‌న సినిమా చూసిన త‌ర్వాత సోహైల్ నువ్వు సేఫ్ అని అన్నారు. ఆ మాట నాకు చాలనిపించింది. 

* ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నా…

– మా సినిమా నిర్మాత హ‌రిత గోగినేనిగారు సినిమాపై కంటెంట్‌తో న‌మ్మ‌కంతో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతోనే మేం కూడా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా వెయిట్ చేస్తున్నాం. 

* సామాజిక సేవ గురించి…

– నేను బిగ్‌బాస్‌లోకి రాక ముందే ప‌క్కన వారికి సాయం చేయాలన‌కుంటుండేవాడిని. మ‌న‌కొక వంద రూపాయ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఇబ్బందుల్లో ఉన్న‌వారికి ప‌ది రూపాయ‌లు ఇస్తే .. మంచి ఆశీర్వాదాలు వ‌స్తాయి. నాకు బిగ్ బాస్ అవ‌కాశం ఎందుకు వ‌చ్చింద‌నే దానిపై ఓ విష‌యాన్ని న‌మ్ముతాను. అదేంటంటే నా ఫ్రెండ్ అజహర్‌ వాళ్ల పాప ఆప‌రేష‌న్‌కు డ‌బ్బులు అవ‌స‌రం అయితే అంద‌రి ద‌గ్గ‌ర మాట్లాడి మూడు ల‌క్ష‌లు క‌లెక్ట్ చేశాను. ప‌ది ల‌క్ష‌ల ఆప‌రేష‌న్‌ని ఆరున్న‌ర ల‌క్ష‌ల‌కు మాట్లాడాను. ఆప‌రేష‌న్ పూర్త‌య్యి పాప పుట్టింది. నేను బిగ్‌బాస్‌లో ఉన్న‌ప్పుడు నా ఫ్రెండ్ అజ‌హ‌ర్ కూడా ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. వీధి కుక్క‌ల‌కు అన్నం పెడుతుంటాను. ఆ ఆశీర్వాద‌మే న‌న్ను న‌డిపించింద‌ని అనుకుంటాను. బిగ్ బాస్‌లో 50 ల‌క్ష‌లు వ‌స్తే ఏం చేస్తావు అని అడిగిన‌ప్పుడు అనాథ శ‌ర‌ణాల‌యంకు ఇద్దామ‌ని అనుకున్నాను. బిగ్ బాస్ నాగ్ సార్ పాతిక ల‌క్ష‌లు ఇచ్చిన‌ప్పుడు అనాథ శ‌ర‌ణాల‌యాల‌కు డ‌బ్బుల‌ను చెక్స్ రూపంలో పంపించేశాను. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి నాతో పాటు ముప్పై మంది స్నేహితులం క‌లిసి సాయం చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మందికి గుండె ఆప‌రేష‌న్స్ చేయించాం. ఏడు కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అందిస్తుంటాం. 10 పిల్ల‌ల ఎడ్యుకేష‌న్‌కి సాయం చేస్తుంటాం. ప్ర‌తి ఇయ‌ర్ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకోను. ఆ డ‌బ్బులను పిల్ల‌ల ఎడ్యుకేష‌న్‌కు ఉప‌యోగిస్తున్నాను. 

* నేను సీరియ‌ల్స్ చేయ‌టానికి కార‌ణమ‌దే..

– ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీ ప‌రంగా అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో కానీ.. బూట్ క‌ట్ బాల‌రాజ్ సినిమాల్లో బిగ్ బాస్‌లో చేసిన వారిని యాక్ట‌ర్స్‌గా తీసుకున్నాం. ఇక్క‌డ టీవీల్లో ఉన్న‌వాళ్లు, సినిమాల్లో ఉన్న‌వాళ్లలో 99 శాతం మంది సినిమాల్లో న‌టించాల‌నే వ‌చ్చారు. అయితే కొన్ని పరిస్థితుల కార‌ణంగా వాళ్లలో కొంద‌రు సీరియ‌ల్స్‌లో సెటిల్ అవుతారు. కొంద‌రు డ‌బ్బింగ్‌.. ఇలా ఫీల్డ్ మారుతుంట‌గారంతే. ఆ క్ర‌మంలో నేను కూడా సీరియ‌ల్స్‌, ఆల్బ‌మ్స్‌లో న‌టించాను. ఇక సినిమాల్లో ఆడియెన్స్ ఎలా ఆశీర్వ‌దిస్తారో చూడాలి. 

* నాలుగు సినిమాలు చేస్తున్నాను..

– ఇప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. న‌టుడిగా నాలో విష‌యం లేక‌పోతే ఇన్ని సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చేవి కావు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి వంటి డైరెక్ట‌ర్‌గారు నాకు అవ‌కాశం ఇచ్చేవారు కాదు. కోట్ల ఖ‌ర్చు పెట్టి నాతో సినిమాలు చేస్తున్నారంటే నేను సినిమాల్లో ప‌నికొస్తాన‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌న్న‌ప్పుడు నేను న‌మ్మ‌లేదు. రెండు సార్లు క‌థ విన్నాను. నిర్మాత‌లు ఎన్ని విష‌యాలు చెప్పినా.. కృష్ణారెడ్డిగారు నేనే హీరోగా ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టి ఛాన్స్ ఇచ్చారు. ఆ విష‌యంలో ఆయ‌న మేలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఈ సినిమాలో చేయ‌టానికి కార‌ణం.. నా ల‌క్ అని మ‌రోసారి చెప్ప‌గ‌ల‌ను.

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

Bigg Boss Telugu fame Sohel is getting ready for the release of ‘Lucky Lakshman’, which will hit the screens on December 30. The out-and-out family entertainer stars Mokksha as the female lead. The film is produced by Haritha Gogineni and directed by AR Abhi. Ahead of the movie’s release, Sohel talks about its highlights and also shares info about his career.

How has your experience been as a cinema hero?

I am enjoying this phase. However, I am not getting adequate rest. Things change when you are not a common man. It’s not easy to handle celebrity status. ‘Lucky Lakshman’ has been going great guns in terms of promotions, content, songs, and the response for the teaser and trailer. Personally, I am still trying to figure out how to be with the media and all during interviews. I always like to be original. I can’t put on an acting front in interviews. That’s a minus for me. I can act only in front of the camera, not otherwise.

Do you think negativity has gone up in the days of social media?

If you are frank, some people receive it with a negative mindset. Out of 100, 20 people are like that. The other day, at the pre-release event, I said that I will bash up people who target my parents. We actors are humans with emotions. Not just me, no actor deserves abusive trolling. I am going to give it back if my parents are targeted. When the comments are negative after you make a movie by spending crores, you are naturally hurt. Toxic trolling disturbs us.

I don’t understand why there is so much negativity on social media. A video in which I attributed my success to my father received just 500 views. But a video where I am seen warning trolls garnered 1.2 lakh views and attracted 700 comments/shares. Even videos related to ‘Waltair Veerayya’ didn’t receive those many views. Why do people want to watch negativity?

How about your much-awaited ‘Mr. Pregnant’?

That was the first movie I did after coming out of Bigg Boss. For some reason, its release got delayed. I worked on it for a year. The delay feels bad. When it gets released, the result will be great. The producer wants to close business before releasing it. I have given my sweat and blood for the movie. Its delay is a bit depressing.

What made you opt for ‘Lucky Lakshman’?

After ‘Mr. Pregnant’, I did ‘Bootcut Balaraju’, which is a mass entertainer. ‘Organic Mama-Hybrid Alludu’ is a complete entertainer. It is a family film with cute love. ‘Lucky Lakshman’ came around the same time. Hard work and luck have to happen together. We need valuable relations that wish well for us.

How do you describe ‘Lucky Lakhsman’?

It’s a family film with a clean and healthy comedy. You won’t find vulgarity in it. I play a software engineer in it. There is no embarrassing scene or line in it.

I am really lucky:

I spent 104 days in the Bigg Boss house. But what Chiranjeevi garu and Nagarjuna garu said about me on the 105th day mattered the most to me. It became a big plus. The finale offered me opportunities after I came out of the house.

It’s all thanks to my father’s support…

It’s all because of my father’s support that I have come this long. A heart surgery, one kidney, blood clot in brain… On the other hand, we are five in the family. He helped us sail through. My father alone supported my cinema dreams. At one stage, I got ready to do my father’s job. But two days before I was supposed to sign the job papers, I migrated to Hyderabad to pursue acting dreams. TV serials would pay me up to Rs 50,000 per month. I used to send half the amount home. My father asked me if I had self-belief. He asked me to stay the course if I was confident.

‘Lucky Lakshman’ is technically strong

It’s like a full meals. Everyone who worked on the movie did their best. The cinematographer I Andrew played a phenomenal role in the shoot getting completed in 28 days. It was a two-schedule movie. The frames are colourful. Anup Rubens’ music and Prawin Pudi’s editing are also top highlights.

A senior producer said that about me…

I am waiting for the audience’s response this Friday. We screened the movie for a senior producer. He said that I am safe. It boosted us a big deal.

I am waiting with excitement…

Producer Haritha Gogineni garu is releasing the movie on her own. She is confident about the movie.

On welfare activities:

If we give away 10% of our income to others, the blessings will do good to us. I went out of my way to help pool finances to fund the surgery of a friend’s infant child. Due to my intervention, the cost of surgery came down from Rs 10 lakh to Rs 6.5 lakh. I collected Rs 3 lakh from my sources. Through Sohel Helping Hands, I and 30 other friends are doing charity activities. We have financed heart operations for five kids. We have been supplying essential groceries to seven families. We are funding the education of ten children. From the Bigg Boss prize money of Rs 50 lakh, I spent Rs 10 lakh on orphanages.

TV serials experience is helping me…

The response for ‘Lucky Lakshman’ has been great. Acting in TV serials is adding to my experience. Most of the artists doing TV serials today entered the industry with the sole aim of becoming film actors. Due to some reasons, they couldn’t land film offers.

I am doing four films currently…

I have got four films in hand. If I did not have acting calibre, I wouldn’t have received these many offers. Someone like SV Krishna Reddy garu wouldn’t have worked with me. They invested crores in my movies. ‘Organic Mama Hybrid Alludu’ came to me only because the director insisted that I be roped in as the hero. He convinced the producer. I will always be indebted to Krishna Reddy garu for that. 

Regards,
Naidu Surendra Kumar (PRO)

Tags

Related Articles

Back to top button
Close
Close