NEWS
Trending

ఆంధ్రప్ర్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి దివ్యసముఖమునకు,

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఏపి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు సినీ నిర్మాతలకు ఇటు చిత్రకార్మికులకు వారధిగా ఉంటూ రాష్ట్రం లో చాలన చిత్ర పరిశ్రమ వికశించుటకు మా వంతు భాద్యత గా ఈ సమస్త ను స్థాపించడం జరిగింది, ఈ వినతి పత్రం ద్వారా చిత్రపరిశ్రమలోని నిర్మాతలు, కార్మికులు ఎదుర్కునుచున్న సమస్యలు, అంతే కాకుండా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుటకు రాష్టప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను మీకు తెలియజేస్తున్నాము.
ఈ కింది సమస్యలను మీకు తెలియజేయడం జరుగుతుంది.
90వ సంవత్సరం లో అప్పటి ముఖ్యమంత్ర్రి చెన్న రెడ్డి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తే వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని చెన్నై నుంచి ఇక్కడికి తరలించి, బడా వ్యక్తులకు ఫిలిం నగర్ సొసైటీ పేరు తో స్థలాలు, అదే విధంగా స్టూడియో నిర్మాణాలకు స్థలాలను తక్కువ ధరకు కేటాయిoచడం జరిగింది, ఆ తర్వాత రోజుల్లో వాటిని సినిమాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కొరకు ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేపించి వ్యాపార ద్రుపధంతో కొన్ని వ్యాపార కేంద్రాలు గా, కొన్ని అపార్ట్మెంట్ లు గా ప్రస్తుతం నిర్మించం జరిగింది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృధి లో భాగంగా ఎవరికైనా స్టూడియో నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ లో స్థలాలు కేటాయిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే వారికే స్టూడియోల నిర్మాణం కొరకు స్థలాలు కేటాయిoచాలి. అలా చేసినప్పుడు రాబోయే రోజుల్లో నగరం అభివృధి చెంది ఆ ప్రాంతం కమర్షియల్ గా అభివృధి చెందినప్పుడు ప్రభుత్వo వాట ఉంటుంది కాబట్టి అది స్టూడియో లాగే సినీ అవసరాల కోసమే ఉపయోగపడేలాగా ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే మాత్రమే ఈ రూల్ కచ్చితంగా పాటించే చర్యలు చేపట్టాలి.
విభజన నిష్పత్తి లో భాగంగా నిర్మాతలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నందు షూటింగ్ లు , డబ్బింగ్ లు, రి రికార్డింగ్ లు, విజ్యువల్ ఎఫెక్ట్స్ లు, కచ్చితంగా చేయుటకు చర్యలు చేపట్టాలి.
సినీ నిర్మాణ సమస్థలు షూటింగ్ తో పాటు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కార్యాలయాలు కలిగి ఉండాలని అల చేస్తే INCOME TAX నిష్పక్తి ప్రకారం ఈ కార్యాలయాలనుంచి అకౌంట్స్ సబ్మిట్ చేస్తే రాష్ట్రానికి కేంద్ర వాట దక్కే అవకాశం ఉంటుంది.
సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తరలించుట లో భాగంగా పూనా ఫిలిం ఇనిస్తిట్యుట్ లాగ నటులను, కొత్త సాంకేతిక నిపుణలను తయ్యారు చేయడానికి స్కిల్ డవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించాలి. ఇది ప్రారంభిస్తే యువకులకు, కళల పట్ల ప్రేమ ఉన్నవారికి ఇది ఒక వేదిక అవుతుంది. ఎందరికొ ఉద్యోగ వసతులు కల్పించుటకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అవకాసం.
సినీ సాంకేతిక నిపుణలను హైదరాబాద్ నుంచి తరలించుటలో భాగంగా ఉదూత్ తూఫాన్ సందర్భంగా సినీ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వచ్చిన అమౌంట్ తో, ప్రభుత్వ సహకారం తో కొన్ని ఫ్లాట్ లను నిర్మిం’చడo జరిగింది ఆ ఫ్లాట్ లను సినీ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలైన నిలువ నీడ లేక హైదరాబాద్ నందు జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు కేటాయిస్తే ఆ కార్మికులు వెంటనే అక్కడికి తరలి వస్తారు కాబట్టి చిత్రపరిశ్రమ విశాఖ నందు అభివృధి చెందే అవకాశం ఉంటుంది. ఆ కాలానికి వై యస్ ఆర్ చిత్రపురి కొలని అని పేరు పెట్టాలి.
డిజిటల్ ప్రొవైడర్స్ లో సినిమా లోడు చేయించే వరకే నిర్మాత భాద్యత. విపియఫ్ చార్జీలు నిర్మాతకు సంభంధం లేదు, ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి లేదా ఇంగ్లిష్ సినిమాలకు ఏ విధంగా విపియఫ్ చార్జీలు అమలు చేస్తున్నారో అదేవిధంగా ప్రాంతీయ భాషా చిత్రాలను ప్రదర్శించేoదుకు చర్యలు తీసుకొని డిజిటల్ ప్రొవైడర్స్ ని నియంత్రించాలి.
లో బడ్జేట్ సినిమాలు మినిమం 16 వారాలు థియేటర్స్ లో ఆడే విధంగా జి.ఓ అమలుపరచాలి.
చిన్న నిర్మాతలను ప్రోత్సహించటంలో భాగంగా 5వ షో వెంటనే అమలుపరచాలి. ఈ షో మధ్యాహ్నం 12.00 గంటల తరువాత ఉండవలెను.
ప్రస్తుత్తం ఉన్న టిక్కెటింగ్ విధానం లో వున్న అవినీతిని పోగొట్టుటకు ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం ప్రభుత్వం అమలు చెయ్యాలి. ప్రేక్షకుల కౌంటింగ్ కొరకు థియేటర్ల లో కెమెరాలు ఏర్పాటు చేయవలెను.
చిన్న సినిమాలు బ్రతకటం కోసం మినీ థియేటర్స్ గవర్నమెంట్ బస్ స్టాండ్ లో, మున్సిపల్ కాంప్లెక్స్ లో’, కనీసం 200 థియేటర్స్ కట్టించే ఏర్పాటు చేయవలెను.
షూటింగ్ విషయాలు
రోడ్ల మీద జరిగే షూటింగ్ లకు ఫ్రీ పర్మిషన్
గవర్నమెంట్ కు సంభందించిన పార్కులు మరియు బంగ్లాలకు నామినల్ ఫీజ్ కు ఇవ్వాలి.
గవర్నమెంట్ సింగిల్ విండో పర్మిషన్ ఇస్తే షూటింగ్ ల దగ్గర పోలీసులు ఎటువంటి ఫండ్ కలెక్ట్ చేయకుండా నిర్మాతకు సహకరించాలి.
ఫ్లక్సిబుల్ రేట్స్ హై క్లాస్ కి మాత్రమే పెంచవలెను, అది కూడా రెట్లో 50% మాత్రమే పెంచవలెను. అడ్మిషను రేటు యధావిధిగా ఉంచవలెను, ఎట్టి పరిస్థితులలోనూ పెంచకూడదు. ప్రతి సినిమా థియేటర్లలో తమిళనాడు రాష్ట్రంలో లాగ బెంచ్ టికెట్లు ఉండే విధంగా అమలు చేయాలి.
పైరసీ చేసిన వ్యక్తికి ప్రస్తుతం ఉన్న వెసులుబాటు అయిన స్టేషన్ బెయిల్ కాకుండా నాన్ బెయిలబుల్ కేసు వర్తించేలా చట్టం చేయవలెను.
పై సమస్యల అన్నింటికి పరిష్కారదిశగా అడుగులేసి చాలన చిత్రపరిశ్రమ అంధ్రప్రదేశ్ లో అభివృధి చెందుటకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close