
‘Ho Egire’ lyrical video from ‘Kalyanam Kamaneeyam’ released
'Ho Egire' lyrical video from 'Kalyanam Kamaneeyam' released

Young hero Santosh Shoban is doing ‘Kalyanam Kamaneeyam’. Kollywood
star Priya Bhavani Shankar is its heroine. With this Sankranthi
release, she is making a strong foray into Telugu cinema. UV Concepts
is producing this awaited movie. An engaging and content-driven film
dealing with marriage and associated issues, the film is directed by
debutant Anil Kumar Aalla. The film will be released in theatres on
January 14, 2023.
‘Ho Egire’, a song from the movie, was released today. Krishna Kantha
has written it. Shravan Bharadwaj’s composition is joined by Kapil
Kapilan’s singing.
Here is how the song unfolds:
‘ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే’
The film’s title motion poster, first look received applause recently.
The songs have been released one at a time. Going by the first song
‘Oh Manasa’ and now this song, the lyrics and music will click with
the listeners. The film has been made as a complete famil entertainer.
“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “హో ఎగిరే” లిరికల్ సాంగ్ రిలీజ్
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ
చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో
ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్
కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల
చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్
కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే,
కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య ప్రేమను
వ్యక్తపరుస్తూ సాగిందీ పాట
ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన
వస్తోంది. లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ
పాటలు అందమైన సంగీత సాహిత్యాలతో ఆకట్టుకుంటున్నాయి. యూవీ కాన్సెప్ట్స్
నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఈ సినిమా సంక్రాంతి
కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.