MOVIE NEWSNEWS

Dhanya Balakrishna Marriage: డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి..అవును ఇది నిజమే..!

Dhanya Balakrishna Marriage: డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి..అవును ఇది నిజమే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ ఎంత ఫేమసో అందరికి తెల్సిందే. ఆ పేరు పెట్టుకున్న కారణంగా ధన్య బాలకృష్ణ కూడా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలు కొన్నే.. ఆమె దక్కించుకున్న సక్సెస్ లు కొన్నే అయినా కూడా మంచి పాపులారిటీ సొంతం అయ్యింది.

లేడీ బాలకృష్ణ అంటూ చాలా మంది ఆమెను పిలుస్తూ ఉంటారు. రాజు గారి గది సినిమాతో పాటు నేను శైలజ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ధన్య బాలకృష్ణ గురించి ఈ మధ్య కాలంలో కల్పిక గణేష్ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.

ధన్య బాలకృష్ణ మరియు దర్శకుడు బాలాజీ మోహన్ లు వివాహం చేసుకున్నారు అంటూ  కల్పిక గణేష్ ఈ మధ్య పలు సార్లు వ్యాఖ్యలు చేసింది. ఆ విషయమై తాజాగా క్లారిటీ వచ్చింది. తాజాగా దర్శకుడు బాలాజీ మోహన్ మరియు ధన్య బాలకృష్ణ లు తమ వ్యక్తిగత విషయాల గురించి కల్పిక మాట్లాడకుండా ఆదేశించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు.

వారిద్దరు కలిసి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి వివాహం అయ్యిందని కన్ఫర్మ్ అయ్యింది. ఏడాది క్రితమే వీరి యొక్క వివాహం అయ్యిందని.. ప్రస్తుతానికి ఇద్దరు కూడా రహస్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు అంటూ వారి సన్నిహితులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

మొత్తానికి ధన్య బాలకృష్ణ మరియు బాలాజీ మోహన్ లు ఏడాది క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ కల్పిక చేసిన వ్యాఖ్యలు నిజమే అని తేలిపోయింది.

ధన్య ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ముందు ముందు కూడా ఆమె నుండి సినిమాలు వస్తాయా అనే క్లారిటీ లేదు. బాలాజీ మోహన్.. ధన్య లు కోర్టుకు వెళ్లారు కనుక వారి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం సరికాదు.

Tags

Related Articles

Back to top button
Close
Close