MOVIE NEWSSpecial Bites

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మరియు ఎథికా ఇన్సురెన్స్ ఆధ్వ‌ర్యంలో స‌క్సెస్‌ఫుల్‌గా ముగిసిన సినీ జ‌ర్న‌లిస్టుల హెల్త్ క్యాంప్‌

Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వార్త‌ల‌ను అందిస్తూ వారిని ఎంట‌ర్‌టైన్ చేసే సినీ జ‌ర్నలిస్టుల సంక్షేమం కోసం ఎర్ప‌డిన సంస్థ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (TFJA). ఈ అసోసియేష‌న్ తెలుగు ఇండ‌స్ట్రీతో మ‌మేక‌మై ఎన్నో కార్య‌క్ర‌మాల్ల‌తో త‌న వంతు పాత్ర‌ను పోషిస్తుంది. తెలుగు సినీ లెజెండ్రీలు, సెల‌బ్రిటీలు సైతం ఈ అసోషియేష‌న్‌కు తమ మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తూ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నారు.

జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూపొందిన TFJA తాజాగా సినీ జ‌ర్న‌లిస్టుల కోసం ఎథికా ఇన్సురెన్స్ బ్రోకింగ్ ప్రై.లి వారి వారి స‌హ‌కారంతో  హెల్త్‌ క్యాంప్‌ను నిర్వ‌హించింది. హైద‌రాబాద్ ఫిల్మ్ చాంబ‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి, నిర్మాత- ద‌ర్శ‌కురాలు,  జీవితా రాజ‌శేఖ‌ర్, హీరో నిఖిల్ సిద్ధార్థ్, బిగ్ బాస్ 6 విన్నర్ –  సింగ‌ర్ రేవంత్‌, జ‌బ‌ర్ద‌స్త్ హైప‌ర్ ఆది త‌దిత‌రులు ప్రారంభించారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో  సిటీలో టాప్ య‌శోద‌,ఒయాసిస్, క్లోవ్ డెంటల్,డెర్మా 360మరియు మ్యాక్స్ విజ‌న్ వంటి ప్ర‌ముఖ హాస్పిట‌ల్స్‌కు చెందిన నిపుణులైన డాక్ట‌ర్స్ ఈ హెల్త్ క్యాంప్‌లో భాగమై ఉచిత చికిత్స‌ల‌ను నిర్వ‌హించారు.

తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రెటరీ వై.జె.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ శేఖర్,  ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు , ప్రసాదం రఘు, రవిచంద్ర, సత్య రామకృష్ణ, సహా ఇతర బాడీ సభ్యుల ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అందించిన స‌దావ‌కాశాన్ని జ‌ర్న‌లిస్టులు చ‌క్క‌గా వినియోగించుకున్నారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఈ హెల్త్ క్యాంపులో చికిత్సలను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా…

జీవితా రాజ‌శేఖ‌ర్ గారు మాట్లాడుతూ ‘‘సినిమా జ‌ర్న‌లిస్టుల కోసం స్టార్ట్ చేసిన TFJA ప్రారంభం నుంచి వారికి తోడుగా నిలుస్తూ చాలా మంచి ప‌నుల‌ను చేస్తూ వ‌స్తున్నారు. సాధార‌ణంగా మ‌న జీవితంలో అనుకోని ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌గుతుంటాయి. అలాంట‌ప్పుడు నా కుటుంబానికి అండ‌గా ఎవ‌రు నిల‌బ‌డ‌తార‌ని అనుకుంటుంటాం. నేను ప‌ని చేసే ప్లేస్ నుంచి నాకొక స‌పోర్ట్ దొరికితే బావుంటుంది అనుకునే అసోసియేష‌న్‌లో స‌భ్యుల‌వుతాం. చాలా అసోసియేష‌న్స్ పెడుతున్నారు. కానీ ఏ అసోసియేష‌న్ ఎంత ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంద‌నే విష‌యాన్ని మ‌నం గ‌మ‌నిస్తే దాన్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి కొన్ని అసోసియేష‌న్స్‌లో TFJA ఒక‌టి. ల‌క్ష్మీ నారాయ‌ణ‌, రాంబాబు, నాయుడు, ఫ‌ణి.. వీళ్లంద‌రూ ఎంతో ఎఫ‌ర్ట్స్‌ పెట్టి ప‌ని చేస్తున్నారు.  వాళ్ల అసోసియేష‌న్ మెంబ‌ర్స్‌కు ప్ర‌తీ క్ష‌ణం అండ‌గా ఉండి న‌డిపిస్తుంది. అందులో భాగంగా నిర్వ‌హిస్తున్న ఈ హెల్త్ క్యాంప్‌లో భాగ‌మైన ఎథికా ఇన్సురెన్స్ సంస్థ‌కు అభినంద‌నలు. సిటీలోని బెస్ట్ డాక్ట‌ర్స్‌ని ఇక్క‌డ‌కు తీసుకొచ్చారు. అసోసియేష‌న్స్ వారికి అభినంద‌న‌లు. ఇంకా ఇలాంటి మంచి ప‌నులతో మ‌రింత ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు మాట్లాడుతూ ‘‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు వారి స‌భ్యుల కోసం నిర్వ‌హిస్తున్న చాలా మంచి కార్య‌క్ర‌మం ఇది. కార్తికేయ, కార్తికేయ 2లో నేను కూడా డాక్ట‌ర్ రోల్ చేశాను. ఇక్క‌డ‌కు వ‌చ్చిన డాక్ట‌ర్స్‌ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. TFJA ఎంటైర్ బాడీకి అభినంద‌న‌లు’’ అన్నారు.

బిగ్ బాస్ 6 విన్నర్ –  సింగర్ రేవంత్ గారు మాట్లాడుతూ ‘‘TFJA వారు కండెక్ట్ చేస్తున్న ఈ హెల్త్ క్యాంప్‌కి సంబంధించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం చాలా సంతోషంగా ఉంది. జ‌ర్న‌లిస్ట్ ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలుసు. మారుతున్న ట్రెండ్‌ను బ‌ట్టి ఇప్పుడు మీడియా పెరిగింది. దాని ప్రాధాన్య‌త కూడా పెరిగింది. సినీ, టీవీ ఏదైనా స‌రే.. ఎంత క‌ష్ట‌ప‌డినా స‌రే ఆర్టిస్ట్ లేదా టెక్నీషియ‌న్‌కి  జ‌ర్న‌లిస్ట్‌, మీడియా నుంచి స‌పోర్ట్ అవ‌స‌రం. మ‌న స‌క్సెస్‌లో జ‌ర్న‌లిస్టులు ఎంతో కీల‌క పాత్ర‌ను పోషించి భాగ‌మ‌వుతున్నారు. అలాంటి బాధ్యతాయుత‌మైన ఉన్న సినీ జ‌ర్న‌లిస్టుల‌కు సంబంధించిన హెల్త్ క్యాంప్‌లో భాగం కావ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఎథికా గ్రూప్ ఇన్సురెన్స్ ఆధ్వ‌ర్యంలో ఈ క్యాంప్‌ను నిర్వ‌హించాను. ప్ర‌తీ జ‌ర్న‌లిస్ట్ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయ‌ర్‌’’ అన్నారు.

హైపర్ ఆది గారు మాట్లాడుతూ ‘‘TFJA వారు, ఎథికా ఇన్సురెన్స్ గ్రూపు వారి ఆధ్వ‌ర్యంలో సినీ జ‌ర్న‌లిస్టుల కోసం హెల్త్ క్యాంప్ నిర్వ‌హించ‌టం చాలా సంతోషంగా ఉంది. మా గురించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసే జ‌ర్న‌లిస్టులు బావుంటేనే మేమూ బావుంటాం. హెల్త్ క్యాంప్‌లో అంద‌రూ భాగం కావాలి. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు ’’ అని తెలిపారు.

TFJA ప్రెసిడెంట లక్ష్మీ నారాయ‌ణ గారు మాట్లాడుతూ ‘‘సినీ జర్నలిస్టుల కోసం, వారి బాగోగుల్లో తోడుగా నిలవటం కోసం TFJAను 2004లో స్థాపించాం. 18 ఏళ్లుగా వారికి అండ దండలను అందిస్తున్నాం. అసోషియ‌ష‌న్ స్థాపించినప్ప‌టి నుంచి అండ‌గా నిలుస్తూ డొనేష‌న్స్ రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సినీ పరిశ్ర‌మ‌లోని పెద్ద‌లంద‌రికీ ఈ సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. మీ స‌హాయ స‌హ‌కారాలు ఇలాగే ఉంటుంద‌ని భావిస్తున్నాం.

TFJA జనరల్ సెక్రెటరీ రాంబాబు గారు మాట్లాడుతూ అసోసియేష‌న్‌లో భాగ‌మైన‌ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, టర్మ్ పాలసీ కింద 15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు అందిస్తున్నాం. వీటితో పాటు ఇప్పుడు నిర్వ‌హించిన హెల్త్ క్యాంపు వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నాం. అలాగే క‌రోనా స‌మ‌యంలోనూ సిన్నీ జ‌ర్న‌లిస్టుల‌కు అసోసియేష‌న్ చేదోడు వాదోడుగా నిలిచింది. భ‌విష్య‌త్తులో సినీ జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం మ‌రిన్ని కొత్త ప్ర‌ణాళిక‌లు తీసుకు వ‌స్తున్నాం. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు

——————————–

Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

Telugu Film Journalists Association on December 25th organized a Free Health Checkup Camp for its members in association with Ethika Insurance Broking Pvt. Ltd. at Hyderabad’s Film Chamber building. The TFJA hosted celebrity guests on the occasion. The event was graced by guests. Actress-director Jeevitha Rajasekhar, hero Nikhil Siddharth, Bigg Boss Telugu 6 winner LV Revanth, Jabardasth fame Hyper Aadi were present. Experts and doctors from Yashoda, Oasis Fertility, Clove dental, Derma 360 and Max Vision hospitals guided the camp.

The TFJA President Lakshmi Narayana, General Secretary YJ Rambabu, Vice-President Sekhar, Treasurer Naidu Surendra Kumar, Executive Committee Members Raghu Prasadam, Ravi Chandra, Satya Ramakrishna, and the Association’s 175 members made use of the camp. The camp was organized for the benefit of film journalists and their families.

Jeevitha Rajasekhar said, “TFJA has carried out several activities for its members over the years. It’s good that journalists have the assurance of health and life insurance from TFJA in case of any eventuality. One’s place of work becoming a pillar of support is a special thing for everyone. So many associations exist but only a handful of them function effectively. TFJA is one of them. Lakshmi Narayana, Rambabu, Naidu, Phani are steering the Association efficiently. They are standing by TFJA’s members all the time. I congratulate Ethika Insurance on this occasion.”

Young actor Nikhil Siddharth said, “This health camp is a necessary one being held under the aegis of TFJA. Incidentally, I played a doctor in the two ‘Kartikeya’ movies. I am happy to see several doctors here.”

Bigg Boss Telugu title winner and singer LV Revanth said, “I am happy to participate in this event. I know the importance of journalists. The media is growing in keeping with the changing trends. And the prominence of the media is also ever-rising. Every artist and technician in the entertainment industry needs the support of journalists and media. This health camp is in service of cine journalists. I wish good health to every journalist and wish them a great 2023 ahead.”

Hyper Aadi said, “I am happy regarding this health camp. The well-being of journalists is crucial. Every eligible member must take part in the camp.”

TFJA President Lakshmi Narayana said, “TFJA was formed in the year 2004 for the welfare of cine journalists. For the past 18 years, the Association has also stood by them. I thank the elders and donors from the film industry for always supporting our Association.”

TFJA General Secretary Rambabu said, “The members are eligible to receive Rs 3 lakhs of medical insurance, Term insurance of Rs 15 lakh, and accident policy of Rs 25 lakh. Additionally, this health camp is being held today. During the coronavirus pandemic, the association has helped several journalists. We are etching several more measures for the benefit of our members. Their details will be revealed soon.”

Tags

Related Articles

Back to top button
Close
Close